Ad Code

'కమీలియన్‌' ఆండ్రాయిడ్ మాల్‌వేర్‌ !


'కమీలియన్‌' అనే ప్రమాదకర మాల్వేర్‌ను స్కామర్లు వివిధ ఆండ్రాయిడ్ యాప్స్, ఏపీకేల ద్వారా డివైజ్‌ల్లోకి పంపిస్తూ మోసాలకు పాల్పడుతున్నారు. ఈ మాల్వేర్‌ డివైజ్‌ బయోమెట్రిక్‌లను కూడా సులభంగా అధిగమించగలదు. కమీలియన్‌ మాల్‌వేర్ డివైజ్‌ సెక్యూరిటీ మెజర్స్‌కు చిక్కకుండా, బ్యాంక్ అకౌంట్‌ పాస్‌వర్డ్‌లు, పిన్ కోడ్, ఇతర సున్నితమైన ఫైనాన్షియల్ డేటాను దొంగిలిస్తుంది. ఈ మాల్వేర్ జాంబ్‌బైండర్ అనే డార్క్ వెబ్ నెట్‌వర్క్ ద్వారా డిస్ట్రిబ్యూట్‌ అవుతుందని సైబర్ సెక్యూరిటీ సంస్థ 'థ్రెట్‌ఫ్యాబ్రిక్' గుర్తించింది. కమీలియన్‌ ట్రోజన్ పాతదే అయినా, ఇది అడ్వాన్స్‌డ్‌గా మారిందని థ్రెట్‌ఫ్యాబ్రిక్ కంపెనీ వెల్లడించింది. ఈ ముప్పు కొత్తది కాదని, ఒక సంవత్సరం లేదా అంతకంటే ఎక్కువ కాలంగా సర్క్యులేట్ అవుతోందని పేర్కొంది. అయితే ఇటీవల స్కామర్లు ఈ మాల్వేర్‌ను మరింత అడ్వాన్స్‌గా మార్చారని, ఇప్పుడు ఇది యూజర్‌ సెన్సిటివ్‌ ఇన్‌ఫర్మేషన్‌ కాజేయడానికి HTML ట్రిక్‌ని ఉపయోగించి డివైజ్‌లలోకి సులువుగా చేరుతుందని తెలిపింది. ఈ మాల్వేర్ పర్సనల్ డేటా, ఫైనాన్షియల్‌ డేటాను సేకరించేందుకు ప్రయత్నిస్తుందని థ్రెట్‌ఫ్యాబ్రిక్ రిపోర్ట్ స్పష్టం చేసింది. స్కామర్ల చేతికి బ్యాంక్‌ అకౌంట్‌ యాక్సెస్‌ వెళ్తే తీవ్ర ఆర్థిక నష్టాలు ఎదుర్కోవాల్సి వస్తుందని హెచ్చరించింది. వినియోగదారులు డబ్బు, పరువు కోల్పోకుండా ఉండాలంటే వీలైనంత జాగ్రత్తగా ఉండాలని ThreatFabric సూచించింది. డివైజ్‌లో కెమీలియన్‌ వంటి మాల్వేర్ చొరబడకుండా ఉండాలంటే ఏకైక మార్గం.. ర్యాండమ్‌ వెబ్‌సైట్‌ల నుంచి యాప్‌లు, APKలు డౌన్‌లోడ్ చేయకూడదు. ముఖ్యంగా పెయిడ్‌ యాప్‌లను ఉచితంగా అందిస్తున్నామనే ఆఫర్లను నమ్మకూడదు. అన్‌ వెరిఫైడ్‌ సోర్సుల నుంచి యాప్‌లు డౌన్‌లోడ్ చేయడం డేంజర్. కాబట్టి గుర్తు తెలియని వ్యక్తులు పంపిన ర్యాండమ్‌ లింక్ నుంచి ఫిషీగా అనిపించే ఏ వెబ్‌సైట్‌ నుంచి కూడా యాప్‌ను డౌన్‌లోడ్ చేయకూడదు. సెండర్‌ లేదా వెబ్‌సైట్ అథెంటిసిటీని ఎల్లప్పుడూ చెక్‌ చేయండి. ఫోన్ నంబర్‌లు, ఇమెయిల్ అడ్రస్‌లు, డొమైన్ నేమ్స్‌, సెండర్‌ ఐడెంటిటీ తెలుసుకోండి. సేఫ్టీకి మరొక మార్గం.. గూగుల్‌ ప్లే ప్రొటెక్ట్‌ను ఆన్‌లో ఉంచడం. ఈ బిల్ట్‌ ఇన్‌ గూగుల్‌ టూల్‌, డివైజ్‌ సేఫ్టీని మానిటర్ చేస్తుంది. వీటితో పాటు యూజర్లు లేటెస్ట్‌ ఆన్‌లైన్ స్కామ్‌లు, మోసాల గురించి ఎప్పటికప్పుడు తెలుసుకోవాలి. ఇన్వెస్ట్‌మెంట్‌ స్కీమ్‌లు, లాటరీ లేదా ప్రైజ్ స్కామ్‌లు, రొమాన్స్ స్కామ్‌లు, టెక్ సపోర్ట్ స్కామ్‌ల పట్ల జాగ్రత్తగా ఉండాలి. వార్నింగ్‌ సైన్స్‌, రెడ్‌ ఫ్లాగ్స్‌పై అవగాహన పెంచుకోవాలి. కంప్యూటర్, స్మార్ట్‌ఫోన్, ఇతర డివైజ్‌ల లేటెస్ట్ సెక్యూరిటీ ప్యాచ్‌లు, యాంటీవైరస్ సాఫ్ట్‌వేర్‌ను ఎప్పటికప్పుడు అప్‌డేట్‌ చేసుకోవాలి. 

Post a Comment

0 Comments

Close Menu