Ad Code

మైక్రోసాఫ్ట్ కోపైలట్‌ విడుదల !


మైక్రోసాఫ్ట్ బింగ్ చాట్ ను కోపైలట్ గా రీబ్రాండ్ చేసింది. ఇప్పుడు కంపెనీ ఆండ్రాయిడ్ వినియోగదారుల కోసం ప్రత్యేక యాప్ ను విడుదల చేసింది. ఈ యాప్ ఛాట్ జీపీటీని పోలి ఉంటుంది. అయితే ఇందులో కొన్ని అదనపు ఫీచర్లు అందుబాటులో ఉన్నాయి. మీరు ఈ యాప్ని గూగుల్ ప్లేస్టోర్ నుంచి డౌన్లోడ్ చేసుకోవచ్చు. మైక్రోసాఫ్ట్ కోపైలట్ యాప్ లో ఛాట్ జీపీటీ వంటి ప్రశ్నలు అడిగే సదుపాయాన్ని పొందుతారు. ఇది కాకుండా ఇమేజ్ క్రియేషన్, ఈ-మెయిల్స్, డాక్యుమెంట్ల కోసం డ్రాఫ్ట్ నోట్స్, డాల్-ఈ 3 ద్వారా జీపీటీ-4 సౌకర్యాన్ని కలిగి ఉంది. జీపీటీ-4 అనేది ఓపెన్ ఏఐ ఛాట్ జీపీటీలో పేమెంట్ ఫీచర్. అయితే ఇది కోపైలట్ లో ఉచితం. ప్రస్తుతం కంపెనీ ఈ యాప్ ను ఆండ్రాయిడ్ వినియోగదారుల కోసం మాత్రమే విడుదల చేసింది. ఈ యాప్ రాబోయే కాలంలో ఐవోఎస్ వినియోగదారుల కోసం కూడా అందుబాటులోకి రావచ్చు. యాప్ ని ఉపయోగించడానికి లాగిన్ అవ్వాలి. దీన్ని మొదటిసారి ఉపయోగించినప్పుడు రిజిస్టర్ చేసుకోవాలి. కంపెనీ వెబ్ సైట్ నుంచి కూడా కోపైలట్ ను యాక్సెస్ చేయవచ్చు. దీని కోసం మీరు copilot.Microsoft.comకి వెళ్లాలి. ఇక్కడ మీరు మైక్రోసాఫ్ట్ ఖాతా, స్కైప్ లేదా మొబైల్ నంబర్ ద్వారా లాగిన్ చేయవచ్చు. 

Post a Comment

0 Comments

Close Menu