క్రిస్మస్ సేల్ విక్రయంలో భాగంగా భారీ తగ్గింపు ధరలకు ఆపిల్ మ్యాక్‌బుక్ డివైజ్‌లపై ఆకర్షణీయమైన డిస్కౌంట్లను అందిస్తోంది. మ్యాక్‌బుక్ ఎయిర్, మ్యాక్‌బుక్ ప్రో, మ్యాక్ మినీ, ఐమ్యాక్ కంప్యూటర్‌లు అధికారిక రీసేల్లర్ నుంచి అందుబాటులో ఉన్నాయి. కొత్త M3 చిప్‌తో ఆధారితమైన వాటితో సహా ఆపిల్ లేటెస్ట్ మోడళ్లకు తగ్గింపులు వర్తిస్తాయి. పాత డివైజ్ ఎక్స్చేంజ్ చేసుకుంటే కొనసాగుతున్న సేల్‌లో భాగంగా మరిన్ని బ్యాంక్ డిస్కౌంట్‌లను పొందవచ్చు. ఇమాజిన్ క్రిస్మస్ కార్నివాల్ సేల్‌లో ఆపిల్ కంప్యూటర్‌లపై భారీ డిస్కౌంట్‌లను అందిస్తోంది. హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్ కార్డ్‌లపై రూ. 5వేలు ఇన్‌స్టంట్ క్యాష్‌బ్యాక్, రూ. 10వేల ఎక్స్చేంజ్ బోనస్, అలాగే వివిధ మోడళ్లపై వివిధ ఇన్‌స్టంట్ డిస్కౌంట్లను అందిస్తోంది. మ్యాక్‌బుక్ ఎయిర్, మ్యాక్‌బుక్ ప్రో, ఐమ్యాక్, మ్యాక్ మినీ వంటి ప్రొడక్టులపై ఆకర్షణీయమైన తగ్గింపులను అందిస్తోంది. ఆపిల్ ఎం1 మ్యాక్‌బుక్ ఎయిర్ (256జీబీ) రూ. 46,918, రిటైల్ ధర రూ. 99,900కు ఆఫర్ చేస్తోంది. రూ. 17,982 ఇన్‌స్టంట్ డిస్కౌంట్, హెచ్‌డీఎఫ్‌సీ కార్డ్‌లపై రూ. 5వేలు ఇన్‌స్టంట్ క్యాష్‌బ్యాక్, పాత డివైజ్ ఎక్స్చేంజ్ చేసుకుంటే.. తాత్కాలికంగా రూ.20వేలు ఎక్స్ఛేంజ్ బోనస్, క్యాషిఫై నుంచి రూ. 10వేలు ఎక్స్ఛేంజ్ బోనస్ కూడా పొందవచ్చు. పైన జాబితా చేసిన డిస్కౌంట్‌తో పాటు, కొనసాగుతున్న సేల్ సమయంలో మ్యాక్‌బుక్ ఎయిర్ (ఎం2, 256జీబీ), మ్యాక్‌బుక్ ఎయిర్ (ఎం2, 15-అంగుళాల), మ్యాక్‌బుక్ ప్రో (ఎం2, 256జీబీ, 512జీబీ)పై కూడా డిస్కౌంట్‌లను పొందవచ్చు.
0 Comments