Ad Code

అన్​డ్రెస్సింగ్​ యాప్స్​కు పెరుగుతున్న డిమాండ్ !


ఫొటోల్లో మహిళల దుస్తులను తొలగించే ఏఐ ఆధారిత యాప్స్​, వెబ్​సైట్స్​కు యూజర్ల సంఖ్య భారీగా పెరుగుతోందని సోషల్​ నెట్​వర్క్​ ఎనాలసిస్​ కంపెనీ గ్రాఫికా రీసెర్చ్​లో తేలింది. ఒక్క 2023 సెప్టెంబర్​లోనే ఈ తరహా వెబ్​సైట్స్​ని ఏకంగా 24 మిలియన్​ మంది వాడినట్టు ఓ నివేదికను ప్రచురించింది గ్రాఫికా. నివేదిక ప్రకారం.. ఇలాంటి న్యూడిఫై యాప్స్​, వెబ్​సైట్స్ మార్కెటింగ్​, ప్రొమోషన్​ కోసం ప్రముఖ సోషల్​ మీడియా సైట్స్​ని వాడుకుంటున్నాయి. ఉదాహరణకు.. ఎక్స్​ (ట్విట్టర్​), రెడ్డిట్​ వంటి సోషల్​ మీడియా సైట్స్​లో.. అన్​డ్రెస్సింగ్​ యాప్స్​ లింక్స్​కు చెందిన యాడ్​లు ఈ ఏడాది నుంచి ఇప్పటివరకు 2,400శాతం పెరిగాయి! ఏదైనా ఫొటోను అప్​లోడ్​ చేస్తే ఆర్టిఫీషియల్​ ఇంటెలిజెన్స్​ని వాడుకుని, అందులోని వ్యక్తిని న్యూడ్​గా చూపిస్తున్నాయి ఈ యాప్స్​, వెబ్​సైట్స్​. వీటిల్లోని చాలా వరకు యాప్స్​ కేవలం మహిళల ఫొటోలను తీసుకునే విధంగా రూపొందించడం జరిగింది! డీప్​ఫేక్​, డీప్​ఫేక్​ పార్నోగ్రఫీపై ఇప్పటికే సర్వత్రా ఆందోళన వ్యక్తం అవుతున్న తరుణంలో ఇలాంటి యాప్స్​ మరింత తలనొప్పిగా మారాయి. ఆర్టిఫీషియల్​ ఇంటెలిజెన్స్​ వాడకం పెరుగుతున్న కొద్ది, ఆన్​లైన్​లో ఏది నిజం, ఏది అబద్ధం అన్నది తెలుసుకోవడం చాలా కష్టమైపోతోందని ప్రపంచ దేశాలు భావిస్తున్నాయి. అన్​డ్రెస్సింగ్​ యాప్స్​నకు డిమాండ్​ పెరుగుతుండటంతో.. ఇలాంటివి మరిన్ని శరవేగంగా పుట్టుకొస్తున్నాయని గ్రాఫికా.. తన నివేదికలో వెల్లడించింది. ఈ తరహా యాప్స్​ని తయారు చేసేందుకు ఉపయోగించే సాఫ్ట్​వేర్స్​.. సులభంగా, ఉచితంగా అందుబాటులో ఉండటం కూడా ఆందోళనకర విషయం అని పేర్కొంది. "ఒకప్పుడు ఫొటోలను మార్ఫ్​ చేసినా, డీప్​ఫేక్​ చేసినా.. కాస్త బ్లర్​గా కనిపించేవి. కానీ ఇప్పుడు వస్తున్న యాప్స్​ చాలా దారుణంగా ఉన్నాయి. ఆ ఫొటోలు చూస్తే.. అవే నిజమైనవి అని అనుకునే విధంగా రియలిస్టిక్​గా ఉంటున్నాయి," అని గ్రాఫికా తెలిపింది. మహిళల దుస్తులను తొలగించే యాప్స్​.. ఫ్రీ అయినా, పెయిడ్​ అయినా.. బీభత్సంగా డిమాండ్​ కనిపిస్తోందట! నెలకు రూ. 1000 వరకు ఛార్జ్​ చేసే పెయిడ్​ యాప్స్​లో కూడా యూజర్ల సంఖ్య విపరీతంగా పెరిగిపోతోందని తెలుస్తోంది.


Post a Comment

0 Comments

Close Menu