Ad Code

ఫోన్‌పేలో 'క్రెడిట్' ఆప్షన్ !


ఫిన్ టెక్ కంపెనీ ఫోన్‌పే తన యూజర్ల కోసం కొత్తగా 'క్రెడిట్' ఆప్షన్ తెచ్చింది. ఈ సెక్షన్‌లో యూజర్లు 'క్రెడిట్ బ్యూరో స్కోర్' చెక్ చేసుకోవచ్చు.హోం పేజీలోని క్రెడిట్ సెక్షన్‌ను ఉపయోగించుకుని క్రెడిట్ లేదా రూపే కార్డుల లావాదేవీలు, రుణాల చెల్లింపులు, అదనపు భారం లేకుండా క్రెడిట్ కార్డు బిల్లులు చెల్లించొచ్చు. యూజర్ల క్రెడిట్ వాడకం, క్రెడిట్ ఏజ్, ఆన్ టైం పేమెంట్స్ తదితర వివరాలతో కూడిన నివేదికను క్రెడిట్ బ్యూరో అందిస్తుంది. ఫోన్‌పే సీఈఓ హేమంత్ గాలా స్పందిస్తూ 'ఫోన్‌పే యాప్‌లో క్రెడిట్ సెక్షన్ ప్రారంభించడానికి ఆసక్తిగా ఉన్నాం. పలు సెగ్మెంట్లలో యూజర్ల క్రెడిట్ అవసరాలను పరిష్కరించేందుకు క్రెడిట్ సెక్షన్ లక్ష్యం. తమ నిర్ణయం యూజర్ల క్రెడిట్ హెల్త్ నిర్వహణతోపాటు ఆర్థిక సాధికారత కల్పిస్తుంది' అని చెప్పారు. మున్ముందు యూజర్లకు కన్జూమర్ లోన్లు ఆఫర్ చేస్తామని తెలిపారు. ఇందుకోసం బ్యాంకులు, నాన్ బ్యాంకింగ్ ఫైనాన్సియల్ కంపెనీలతో సంప్రదింపులు జరుపుతున్నట్లు తెలిపారు.

Post a Comment

0 Comments

Close Menu