Ad Code

మెటా ఏఆర్ గ్లాసెస్ !


పెన్ఏఐ ఇంటరాక్టివ్ ఏఐ చాట్‌బాట్ చాట్‌జీపీటీని ప్రవేశపెట్టిన అనంతరం ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ టెక్ ప్రపంచంలో హాట్ డిబేట్‌గా మారింది. గూగుల్‌, మైక్రోసాఫ్ట్ వంటి టెక్ దిగ్గజాలు తమ సొంత ఏఐ చాట్‌బాట్స్‌ను ప్రవేశపెట్టగా మెటా సైతం ఏఐ రేస్‌లోకి ఎంట్రీ ఇచ్చింది. ఏఐ అసిస్టెంట్‌తో పాటు స్మార్ట్ గ్లాసెస్ లాంఛ్ చేయనున్నట్టు ఈ ఏడాది సెప్టెంబర్‌లో మెటా ప్రకటించింది. ఇక ఈ ప్రపంచంలోనే అత్యంతాధునిక టెక్నాలజీతో ఏఆర్ గ్లాసెస్‌ను ప్రవేశపెడతామని మెటా సీటీవో ప్రకటించారు. వినిమయ ఎలక్ట్రానిక్స్ విభాగంలో స్మార్ట్ గ్లాసెస్ అత్యాధునిక టెక్నాలజీతో కూడినవని మెటా సీటీవో ఆండ్రూ బాస్‌వర్త్ పేర్కొన్నారు. ఈ ప్రాజెక్టును అంతర్గతంగా ప్రాజెక్ట్ నజారేగా వ్యవహరిస్తారు. మనం స్మార్ట్‌ఫోన్లను ఏమాత్రం ఉపయోగించని రోజులను దృష్టిలో ఉంచుకుని ఈ గ్లాసులను డిజైన్ చేస్తున్నారు. తొలి ప్రొటోటైప్ 2024లో ఆవిష్కరించేందుకు మెటా ఉద్యోగులు కసరత్తు సాగిస్తుండగా, అత్యాధునిక డిజైన్లు 2029 నాటికి సిద్ధమవుతాయని భావిస్తున్నారు. ఈ గ్లాస్‌లు ప్రామాణిక వీడియో కాల్స్‌కు వెలుపల ఇతరుల హాలోగ్రామ్స్‌తో ఇంటరాక్ట్ అయ్యే వెసులుబాటుతో పాటు యూజర్లకు అద్భుతమైన ఎక్స్‌పీరియన్స్ అందిస్తాయని చెబుతున్నారు. ఇక మెటా ఇప్పటికే రేబాన్ సహకారంతో న్యూ స్మార్ట్ గ్లాసెస్‌ను ప్రకటించగా ఇవి మ్యూజిక్ ప్లే చేయడం, ఫొటోలు తీయడం, వీడియోలను రికార్డు చేయడంతో పాటు ఆయా ఈవెంట్స్‌ను నేరుగా ఫేస్‌బుక్‌, ఇన్‌స్టాగ్రామ్‌లో లైవ్ స్ట్రీమింగ్ చేసే వెసులుబాటు కల్పిస్తాయి.

Post a Comment

0 Comments

Close Menu