Ad Code

ఫ్లిప్‌కార్ట్‌లో వింటర్ ఫెస్ట్ !


ఫ్లిప్‌కార్ట్‌లో వింటర్ ఫెస్ట్ మొదలైంది. డిసెంబర్ 31న ఈ సేల్‌ ముగియనుంది. దాదాపు అన్ని కంపెనీలు స్మార్ట్‌ఫోన్‌లపై భారీ తగ్గింపులను అందిస్తున్నాయి. అయితే, మీరు హై-ఎండ్ శామ్‌సంగ్ ఫోన్‌ను కొనుగోలు చేయాలని భావిస్తుంటే ఈ సేల్ అద్భుతమైన ఆఫర్‌ను అందిస్తుంది. ఈ సేల్‌లో మీరు శాంసంగ్ గెలాక్సీ ఎస్22 5జీ, ఎస్21 ఎఫ్ఈ 5జీ ఫోన్లను 50శాతం కన్నా ఎక్కువ తగ్గింపుతో కొనుగోలు చేయవచ్చు. ఆకర్షణీయమైన బ్యాంక్ డిస్కౌంట్‌లు, బ్యాంక్ ఆఫర్‌లతో ఈ ఫోన్‌లు కూడా మీ సొంతం చేసుకోవచ్చు. శాంసంగ్ గెలాక్సీ 21 ఎఫ్ఈ 5జీ ఫోన్ 8జీబీ ర్యామ్, 128జీబీ ఇంటర్నల్ స్టోరేజ్ ధర రూ.69,999కు సొంతం చేసుకోవచ్చు. మీరు డిస్కౌంట్ తర్వాత సేల్ సమయంలో రూ. 32,999కి కొనుగోలు చేయవచ్చు. అదనంగా, బ్యాంక్ డీల్‌లో కంపెనీ ఈ ఫోన్‌పై 10శాతం అదనపు తగ్గింపును అందిస్తోంది. ఎక్స్ఛేంజ్ ఆఫర్‌తో ఈ ఫోన్‌ను రూ. 25,350 వరకు కొనుగోలు చేయవచ్చు. వినియోగదారులు ఎంచుకున్న కొన్ని మోడళ్లపై అదనంగా రూ. 3వేలు ఆదా చేసుకోవచ్చు. 5జీ ఫోన్ 6.4-అంగుళాల ఫుల్ హెచ్‌డీ ప్లస్ డిస్‌ప్లే కలిగి ఉంది. ఫొటోలు క్యాప్చర్ తీసేందుకు రెండు 12ఎంపీ, ఒక 8ఎంపీ కెమెరాలను ఉపయోగిస్తారు. ఓఐఎస్ లేదా ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్ అనేది ఫోన్ ప్రాధమిక కెమెరా ఫీచర్ అని చెప్పవచ్చు. ఈ ఫోన్ సెల్ఫీ కెమెరా 32ఎంపీ కలిగి ఉంది. బ్యాటరీ విషయానికి వస్తే.. ఈ ఫోన్‌లో 4500ఎంఎహెచ్ బ్యాటరీ ఉంది. హార్డ్‌వేర్ విషయానికొస్తే.. ఈ ఫోన్‌లో స్నాప్‌డ్రాగన్ 888 ప్రాసెసర్ ఉంది. శాంసంగ్ గెలాక్సీ ఎస్ 22 5జీ ఫోన్ 56శాతం తగ్గింపుతో అందిస్తోంది. ఈ డివైజ్ వాస్తవానికి రూ. 85,999కి జాబితా అయింది. కానీ విక్రయంలో భాగంగా ఇప్పుడు రూ. 36,999కి మాత్రమే అందుబాటులో ఉంది. ఇందులో 8జీబీ ర్యామ్, 128 జీబీ ఇంటర్నల్ స్టోరేజ్ ఉన్నాయి. బ్యాంక్ ఆఫర్‌లో మీకు 10శాతం అదనంగా డిస్కౌంట్ ఉంటుంది. స్వాప్ డీల్‌లో బిజినెస్ కస్టమర్‌లకు రూ.25,550 వరకు తగ్గింపును అందిస్తుంది. కొన్ని మోడళ్లపై రూ. 3వేలు అదనపు తగ్గింపును కూడా పొందవచ్చు. ఈ శాంసంగ్ ఫోన్‌లో 6.1-అంగుళాల ఫుల్ హెచ్‌డీ+ డిస్‌ప్లే ఉంది. అదనంగా, ఫోన్ తయారీదారు అందించే 50ఎంపీ ట్రిపుల్ కెమెరా కాన్ఫిగరేషన్‌ను కలిగి ఉంది. ఈ ఫోన్‌లో 3700ఎంఎహెచ్ బ్యాటరీ ఉంది. స్నాప్ డ్రాగన్ 8 జెన్ 1 చిప్ ఈ ఫోన్‌కు పవర్ అందిస్తుంది.

Post a Comment

0 Comments

Close Menu