Ad Code

హైబర్నేట్ మోడ్, స్లీప్ మోడ్ మధ్య తేడా ?

                                             

విండోస్ కంప్యూటర్లలోని పవర్ ఆప్షన్లలో స్లీప్ మోడ్ మంచిదా ? షట్​ డౌన్ మోడ్ మంచిదా ? హైబర్నేట్ మోడ్ మంచిదా ? వీటిలో బెస్ట్ ఆప్షన్ ఏది అనే డౌట్ చాలామందికి వస్తుంటుంది. వాస్తవానికి ఈ మూడు ఆప్షన్లకు తోడుగా ఫాస్ట్ స్టార్టప్ అనే మరో ఆప్షన్​ను కూడా మైక్రోసాఫ్ట్ జోడించింది. మనం 'హైబర్నేట్ మోడ్‌'ను వాడితే.. కంప్యూటర్ ర్యామ్​లోని కంటెంట్​ను హార్డ్​ డిస్క్​ లేదా ఎస్​ఎస్​డీలో సేవ్​ చేస్తుంది. ఆ తర్వాతే కంప్యూటర్​​​ పవర్ ​ఆఫ్ అవుతుంది. మనం ఎక్కువ అప్లికేషన్లు ఓపెన్​ చేసినప్పుడు, కంప్యూటర్​ హైబర్నేట్ కావడానికి కాస్త ఎక్కువ సమయం పడుతుంది. మనం మళ్లీ కంప్యూటర్ ఆన్ చేసినప్పుడు.. అంతకుముందు ఉపయోగించిన అప్లికేషన్లు అన్నీ బ్యాకప్ అవుతాయి. ప్రొఫెషనల్స్​కు, చాలా అప్లికేషన్లు వాడేవారికి హైబర్నేట్ ఆప్షన్ ఉపయోగపడుతుంది. కంప్యూటర్‌ను లోపవర్ మోడ్​లో ఉంచే ఆప్షన్ పేరే 'స్లీప్ మోడ్'. ఈ మోడ్​లో ఉన్నప్పుడు కంప్యూటర్‌లోని ర్యామ్​కు పవర్ సప్లై అవుతుంది. ఫలితంగా మీరు పీసీలో ఉపయోగించిన అన్ని యాప్​లు, డేటా ప్రాసెస్​లోనే ఉంటాయి. ఈ దశలో కంప్యూటర్ పవర్ ఆఫ్ చేసినా, ఎటువంటి డేటాను కోల్పోయే ఛాన్స్ ఉండదు. 'స్లీప్ మోడ్'​లో ఉన్నప్పుడు.. ఫుల్ షట్​డౌన్​ కంటే త్వరగా యాప్‌లు రీలోడ్ అవుతాయి. ఇలాంటి దశలో పీసీ లేదా ల్యాప్​టాప్​లో బ్యాటరీ ఛార్జ్ అయిపోయినప్పుడు ర్యామ్​లో ఉన్న సమాచారం అంతా పోతుంది. అందుకే ఈ మోడ్​లో ఉంచేటప్పుడు పవర్​ సప్లై జరిగేలా చూసుకోవడం అవసరం. కంప్యూటరులో 'షట్ డౌన్' ఆప్షన్​ వాడితే.. అప్పటి వరకు ఓపెన్​ చేసి ఉన్న యాప్​లన్నీ క్లోజ్ అవుతాయి. ఏ అప్లికేషన్​, డేటా కూడా ప్రిజర్వ్​ కాదు. మళ్లీ మీరు పీసీ ఓపెన్​ చేయాలనుకుంటే మొత్తం రీబూట్ అవుతుంది. షట్​డౌన్​ ఆప్షన్ అనేదది కంప్యూటర్​కు పవర్​కట్ చేస్తుంది. స్లీప్, హైబర్నేట్​లతో పోలిస్తే కంప్యూటర్​ షట్​డౌన్ కావడానికి ఎక్కువ టైమే పడుతుంది. కొద్దిసేపు కంప్యూటర్​ను ఉపయోగించము అనుకున్న టైంలో కంప్యూటరును స్లీప్ మోడ్​లో ఉంచొచ్చు. కంప్యూటరు బ్యాటరీలో తగినంత ఛార్జింగ్ ఉన్నప్పుడే ఈ ఆప్షన్​ను ఉపయోగించుకుంటే బెస్ట్. కంప్యూటరు బ్యాటరీ పవర్ తక్కువగా ఉన్నప్పుడు సిస్టమ్​ను ఎక్కువ టైం ఉపయోగించాలనుకుంటే హైబర్​నెట్ ఆప్షన్ బెస్ట్. కంప్యూటరులో వర్క్ అంతా పూర్తయ్యాక షట్​డౌన్ ఆప్షన్‌ను ఎంచుకోవాలి. కంప్యూటరు ప్రతిసారీ కొత్తగా ప్రారంభించాలి అనుకుంటే మైక్రోసాఫ్ట్ వాళ్లు అందించిన ఫాస్ట్ స్టార్టప్ ఆప్షన్​ను వాడాలి.

Post a Comment

0 Comments

Close Menu