Ad Code

పెరగనున్న బీఎండబ్ల్యూ కార్ల ధరలు !


ప్రముఖ ఆటోమొబైల్ లగ్జరీ కంపెనీ బీఎండబ్ల్యూ కూడా కార్ల ధరలను పెంచనున్నట్టు ప్రకటించింది. పెరుగుతున్న ఇన్‌పుట్ ఖర్చులు, మారకపు ధరలలో హెచ్చుతగ్గుల కారణంగా జనవరి 1, 2024 నుంచి తమ కార్ల ధరలను పెంచనున్నట్లు బీఎండబ్ల్యూ ఇండియా ప్రకటించింది. మొత్తం బీఎండబ్ల్యూ మోడల్ కార్ల ధరలు 2శాతం వరకు పెంచనున్నట్టు కంపెనీ వెల్లడించింది. స్థానికంగా ఉత్పత్తి చేసిన కార్ల తయారీదారుల శ్రేణిలో బీఎండబ్ల్యూ 2 సిరీస్ గ్రాన్ కూపే, బీఎండబ్ల్యూ 3 సిరీస్ గ్రాన్ లిమోసిన్, బీఎండబ్ల్యూ ఎమ్ 340ఐ, బీఎండబ్ల్యూ 5 సిరీస్, బీఎండబ్ల్యూ 6 సిరీస్, బీఎండబ్ల్యూ 7 సిరీస్, బీఎండబ్ల్యూ ఎక్స్ 1, బీఎండబ్ల్యూ ఎక్స్3, బీఎండబ్ల్యూ ఎక్స్7, బీఎండబ్ల్యూ మినీఎక్స్ 5 వంటి మోడల్స్ ఉన్నాయి. బీఎండబ్ల్యూ జెడ్4, బీఎండబ్ల్యూ ఎమ్4 కూపే, బీఎండబ్ల్యూ ఎక్స్3 ఎం40ఐ, బీఎండబ్ల్యూ ఎక్స్4 ఎమ్40ఐ, బీఎండబ్ల్యూ ఎమ్5, బీఎండబ్ల్యూ ఎమ్8 కూపే, బీఎండబ్లయూ ఎక్స్ఎమ్, బీఎండబ్ల్యూ ఐఎక్స్1, బీఎండబ్ల్యూఐ4, బీఎండబ్ల్యూ ఐ7, బీఎండబ్ల్యూ ఐఎక్స్ వంటి ఎలక్ట్రిక్ కార్లు దేశంలో పూర్తిగా అందుబాటులో ఉన్నాయి. అభివృద్ధి చెందుతున్న డైనమిక్స్, మారకపు రేట్లలో హెచ్చుతగ్గులు, పెరుగుతున్న ఇన్‌పుట్ ఖర్చుల నేపథ్యంలో ఈ ధరలను పెంచడం తప్పడం లేదని బీఎండబ్ల్యూ గ్రూప్ ఇండియా అధ్యక్షుడు విక్రమ్ పవా అన్నారు. బీఎండబ్ల్యూ గ్రూప్ బీఎండబ్ల్యూ ఇండియాలో రూ. 520 కోట్లకు పైగా పెట్టుబడి పెట్టింది. భారత్‌లో విస్తృత శ్రేణి కార్యకలాపాలలో చెన్నైలో తయారీ ఫ్యాక్టరీ, పూణేలో విడిభాగాల తయారీ ప్లాంట్, గురుగ్రామ్‌లో ట్రైనింగ్ సెంటర్, దేశంలోని మెట్రోపాలిటన్ కేంద్రాలలో డీలర్ సంస్థ అందుబాటులో ఉంది.


Post a Comment

0 Comments

Close Menu