Ad Code

గూగుల్‌పై క్లాసిక్ లా సూట్ !


'న్‌కాగ్నిటో' మోడ్‌లో ఇంటర్నెట్ బ్రౌజ్ చేస్తున్న లక్షల మంది యూజర్ల వ్యక్తిగత డేటాను గూగుల్ ట్రాకింగ్ చేస్తున్నట్లు అభియోగాలు ఎదుర్కొంటున్నది. దీనిపై గూగుల్ యాజమాన్యానికి వ్యతిరేకంగా ఒక కంపెనీ 'క్లాస్ యాక్షన్ లా సూట్' దాఖలు చేసింది. ఈ కేసు కాలిఫోర్నియాలోని యూఎస్ డిస్ట్రిక్ట్ జడ్జి య్వోన్నె గొనాలెజ్ రోజర్స్ బెంచ్ ముందుకు విచారణకు వచ్చింది. తొలుత ఈ కేసు తిరస్కరించాలని గూగుల్ చేసిన అభ్యర్థనను న్యాయమూర్తి తిరస్కరించారు. దీంతో పిటిషనర్‌తో రాజీ ఒప్పందం కుదుర్చుకునేందుకు గూగుల్ ముందుకు వచ్చింది. అప్పటి వరకూ విచారణను నిలిపేస్తున్నట్లు న్యాయమూర్తి య్వోన్నె గొనాలెజ్ రోజర్స్ ప్రకటించారు. సదరు పిటిషనర్‌కు రూ.41 వేల కోట్లు (500 కోట్ల డాలర్లు) చెల్లించేందుకు గూగుల్ సిద్ధమైనట్లు సమాచారం. పిటిషనర్, గూగుల్ మధ్య కుదిరిన ఒప్పందం పూర్తి వివరాలు వెల్లడి కాకున్నా.. సెర్చింజన్ న్యాయవాదులు మధ్యవర్తిత్వం ద్వారా రాజీ ఒప్పందానికి కట్టుబడి ఉంటామని అంగీకరించారు. సదరు మధ్యవర్తిత్వ రాజీ ఒప్పందానికి 2024 ఫిబ్రవరి 24న న్యాయమూర్తి ఆమోదం తెలుపుతారని భావిస్తున్నారు. 'ఇన్‌కాగ్నిటో' మోడ్‌లో ఇంటర్నెట్ బ్రౌజ్ చేస్తున్న లక్షల మంది యూజర్ల వ్యక్తిగత డేటాను గూగుల్ తన గూగుల్ అనలిటిక్స్, కుకీస్, యాప్స్ ద్వారా ట్రాక్ చేస్తున్నదని సదరు పిటిషనర్ ఆరోపించారు. 'ఇన్‌కాగ్నిటో' మోడ్‌ను ఏర్పాటు చేసిందే గూగుల్. 'ఇన్‌కాగ్నిటో' మోడ్‌ అంటే ప్రైవేట్‌గా ఇంటర్నెట్ బ్రౌజింగ్ చేసే పద్దతి. ఈ మోడ్‌లో ఇంటర్నెట్ బ్రౌజ్ చేస్తున్నప్పుడు మీ 'బ్రౌజింగ్ హిస్టరీ'ని కుకీస్ ట్రాక్ చేయబోవని గూగుల్ పేర్కొంటున్నది. పిటిషన్ దాఖలు చేసిన సంస్థ తమ స్నేహితులు, హామీలు, ఫేవరెట్ ఫుడ్, షాపింగ్ హాబిట్స్ తదితర వ్యక్తిగత సమాచారాన్ని గూగుల్ దొంగిలిస్తున్నదని ఆరోపించింది. దీనిపై ఇరుపక్షాల వాదనలు విన్న తర్వాత జడ్జి రోజర్స్ స్పందిస్తూ.. ప్రైవేట్ మోడ్‌లో నెట్ బ్రౌజింగ్ చేస్తున్న యూజర్ల డేటాను సేకరించబోమని చేసిన వాగ్ధానానికి చట్టబద్ధంగా గూగుల్ కట్టుబడి ఉంటుందా? లేదా? అన్న ప్రశ్న ఉదయిస్తుందని అన్నారు. 2016 జూన్ ఒకటో తేదీ నుంచి లక్షల మంది యూజర్ల డేటాను గూగుల్ తస్కరిస్తున్నదని 2020లో సదరు సంస్థ ఈ పిటిషన్ దాఖలు చేసింది. ఇది కాలిఫోర్నియా వ్యక్తిగత గోప్యత చట్టాలను ఉల్లంఘించడమేనని, యూజర్లకు 5000 డాలర్ల నష్ట పరిహారం చెల్లించాలని ఆ పిటిషన్‌లో డిమాండ్ చేసింది.

Post a Comment

0 Comments

Close Menu