Ad Code

ఫాక్స్‌కాన్ ప్రతినిధి బృందంతో రేవంత్ రెడ్డి భేటీ !


ఫాక్స్‌కాన్‌కు చెందిన హాన్ హాయ్ ప్రెసిషన్ ఇండస్ట్రీస్ ప్రతినిధి వీ లీ నేతృత్వంలోని బృందం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని సచివాలయంలో కలిసింది. ఈ సందర్భంగా సీఎం రేవంత్‌ మాట్లాడుతూ అన్ని వర్గాలకు స్నేహపూర్వకంగా ఉండే విధానాన్ని అవలంబిస్తున్నామని, పారిశ్రామిక వేత్తలకు కూడా పూర్తి సహాయ, సహకారం అందిస్తామని చెప్పారు. పరిశ్రమల అభివృద్ధి, ఏర్పాటుకు కావాల్సిన అనుమతులు సులభంగా అందించడంతో పాటు, మౌలిక సదుపాయాలను కల్పిస్తామని రేవంత్ రెడ్డి పేర్కొన్నారు. రాష్ట్రాన్ని పారిశ్రామికంగా దేశంలోనే అగ్రగామిగా ఉంచేందుకు కావాల్సిన అన్ని చర్యలను తీసుకుంటామని తెలిపారు. ఈ సమావేశంలో పరిశ్రమల శాఖ మంత్రి శ్రీధర్ బాబు, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతి కుమారి, ఇతర ఉన్నతాధికారులు పాల్గొన్నారు.

Post a Comment

0 Comments

Close Menu