సైబర్ నేరగాళ్లు వాట్సాప్ యూజర్ల సున్నితమైన సమాచారాన్ని దొంగిలించి వినియోగదారులను మోసగిస్తున్నారు. ఆన్‌లైన్ ద్వారా ఆపరేట్ చేసే గుర్తుతెలియని వ్యక్తుల మాయలో పడి వేలాది మంది ప్రజలు కష్టపడి సంపాదించిన డబ్బును పోగొట్టుకున్న ఘటనలు అనేకం వెలుగులోకి వస్తున్నాయి. వర్క్ ఫ్రమ్ హోమ్ స్కామ్‌లు, యూట్యూబ్ వీడియో స్కామ్‌లు, హోటల్ రేటింగ్ స్కామ్‌లు, హాయ్ మామ్ స్కామ్‌లు (స్కామర్‌లు బంధువులుగా నటిస్తూ డబ్బు అడగడం) మొదలైనవి ఉన్నాయి. అయితే, ఈ స్కామర్ల ఫిషింగ్ ట్రిక్స్ ఎప్పటికప్పుడూ కొత్తదనంతో మోసగించడం మరింత ఆందోళన కలిగిస్తుంది. వాట్సాప్ ఇటీవలే లాంచ్ చేసిన స్క్రీన్ షేర్ ఫీచర్‌ను లక్ష్యంగా చేసుకుని స్కామర్లు కొత్త స్కామ్‌కు పాల్పడుతున్నారు. వినియోగదారులను మోసం చేయడానికి సైబర్ నేరగాళ్లు సరికొత్త మార్గాల్లో ప్రయత్నిస్తున్నారు. వాట్సాప్ స్క్రీన్ షేర్ స్కామ్ అనేది మోసపూరిత స్కామ్. ఇందులో స్కామర్‌లు వాట్సాప్ యాప్ ద్వారా వారి ఫోన్‌లో స్క్రీన్ షేరింగ్‌ను ఎనేబుల్ చేసేలా యూజర్లను మోసగిస్తారు. సున్నితమైన సమాచారం కోసం డైరెక్ట్ రిక్వెస్టులపై ఆధారపడే సాంప్రదాయ స్కామ్‌ల మాదిరిగా కాకుండా ఈ స్కామ్ వినియోగదారులను స్కామర్‌లకు రియల్ టైమ్ ఫోన్ స్క్రీన్‌కు యాక్సెస్‌ని పొందేలా చేస్తుంది. స్కామర్‌లు యూజర్ల ఐడెంటిటీని క్లోన్ చేయడం ద్వారా లేదా ఫోన్ సంబంధిత సమస్యలతో హెల్ప్ అందించడం వంటివి ద్వారా వ్యక్తిగత సమాచారాన్ని దొంగిలిస్తారు. అయితే, వినియోగదారులు స్క్రీన్ షేర్‌ను ఎనేబుల్ చేసిన వెంటనే వారికి తెలియకుండానే స్కామర్‌కు తమ స్క్రీన్‌పై జరుగుతున్న ప్రతిదాన్ని రియల్ టైమ్ చూసే సామర్థ్యాన్ని పొందుతారు. ఈ యాక్సెస్ వాట్సాప్ మెసేజ్‌లకు మించినది. బ్యాంక్ అకౌంట్లు, సోషల్ మీడియా లేదా ఇతర ముఖ్యమైన సర్వీసులకు వన్-టైమ్ పాస్‌వర్డ్‌లు (OTP) వంటి సున్నితమైన సమాచారం వరకు స్కామర్ల చేతుల్లోకి వెళ్లిపోతుంది. స్క్రీన్ షేర్ వ్యవధిలో వినియోగదారులు స్క్రోల్ చేసే ఏదైనా సమాచారాన్ని ఉపయోగించి, స్కామర్‌లు బ్యాంక్ అకౌంట్లను ఖాళీ చేసేందుకు ఓటీపీలను ఉపయోగిస్తుంటారు. వినియోగదారుని సోషల్ మీడియా నుంచి లాక్ చేయడానికి పాస్‌వర్డ్‌లను మార్చవచ్చు లేదా భవిష్యత్తులో ట్రాకింగ్ కోసం మాల్వేర్‌ను ఇన్‌స్టాల్ చేయవచ్చు. ఈ స్కామ్ ఎందుకు ప్రమాదకరమైనదంటే.. స్కామర్‌లకు వినియోగదారులు సమాచారాన్ని అందించాల్సిన అవసరం లేదు. స్క్రీన్ షేరింగ్‌ని ఎనేబుల్ చేయడానికి యూజర్లు బటన్‌ను క్లిక్ చేయడం మాత్రమే వారికి అవసరం. ఇలా చేయడం సురక్షితం కాదు. యూజర్ల నుంచి ఎలాంటి యాక్టివ్ ఇన్‌పుట్ లేకుండా సున్నితమైన డేటాను యాక్సెస్ చేయడానికి స్కామర్లను అనుమతిస్తుంది. ఒకసారి పొందిన తర్వాత ఈ డేటా బ్యాంక్ అకౌంట్లను తొలగించడానికి సోషల్ మీడియా అకౌంట్లను హ్యాక్ చేయడానికి స్కామర్లను అనుమతిస్తుంది.
వాట్సాప్‌లో తెలియని నంబర్‌ల నుంచి వాయిస్/వీడియో కాల్‌లను స్వీకరించేటప్పుడు జాగ్రత్తగా ఉండండి. తెలియని కాంటాక్టుల నుంచి వచ్చిన కాల్‌లకు సమాధానం ఇవ్వకుండా ఉండండి. సందేహాలు ఉంటే.. కొనసాగించే ముందు కాలర్ ఐడెంటిటీని ధృవీకరించండి. చట్టబద్ధమైన అభ్యర్థనలు చేసినప్పటికీ ఓటీటీపీలు, క్రెడిట్/డెబిట్ కార్డ్ నంబర్‌లు లేదా సీవీవీ ఎవరితోనూ షేర్ చేయవద్దు. మీ పాస్‌వర్డ్‌ల ప్రైవసీని కాపాడుకోండి. బ్యాంకు అధికారులు సహా ఎవరికీ వ్యక్తిగత వివరాలను వెల్లడించవద్దు. వీడియో కాల్‌లో స్క్రీన్‌ను షేర్ చేస్తున్నప్పుడు చూపించే ఫైల్‌ను ఓపెన్ చేసినట్టు నిర్ధారించుకోండి. మీరు పాస్‌వర్డ్‌ల వంటి సున్నితమైన సమాచారాన్ని పంపిన మెసేజ్‌లు లేదా నోట్‌ప్యాడ్‌ల వంటి యాప్‌లను ఓపెన్ చేయొద్దు.
0 Comments