Ad Code

ఫిబ్రవరి 1 నుంచి పెరగనున్న టాటా కార్ల ధరలు !


ఫిబ్రవరి 1 నుంచి టాటా కార్ల ధరలు భారీగా పెరగనున్నాయి. టాటా కార్లతో పాటు ఇటీవలే లాంచ్ అయిన టాటా ఎలక్ట్రిక్ కార్ల ధరలు కూడా పెరగనున్నాయి. దీనికి సంబంధించి దేశీయ ఆటోమేకర్ టాటా మోటార్స్ ఒక ప్రకటనలో వెల్లడించింది. టాటా మోటార్స్ ఎలక్ట్రిక్ వాహనాలు EV సహా మొత్తం ప్యాసింజర్ వాహనాలపై సగటున 0.7 శాతం ధరలను పెంచుతున్నట్లు కంపెనీ ప్రకటించింది. వచ్చే నెల నుంచి కొత్త ధరలు అమల్లోకి రానున్నాయి. టాటా మోటార్స్ కంపెనీ.. ప్రస్తుతం పెరుగుతున్న ఇన్‌పుట్ ఖర్చులను పాక్షికంగా ఆఫ్‌సెట్ చేయడమే లక్ష్యంగా పెట్టుకుంది. ప్రతి మోడల్‌కు సంబంధించి కచ్చితమైన ధర పెరుగుదలను వెల్లడించనప్పటికీ, టాటా మోటార్స్ నిర్దిష్ట వేరియంట్, మోడల్‌పై ఆధారపడి 0.7 శాతం సగటు పెంపు ఉండనున్నట్టు కంపెనీ చెబుతోంది. అంటే.. టియాగో, నెక్సాన్, హారియర్, సఫారి వంటి పాపులర్ టాటా మోడల్‌ ధరలు భారీగా పెరగనున్నాయి. ఇటీవలే లాంచ్ అయిన పంచ్ ఈవీ మోడల్ ప్రారంభ ధర రూ. 11 లక్షలు (ఎక్స్-షోరూమ్) ఉండగా.. దీని ధర కూడా పెరిగే అవకాశం ఉంది. టాటా మోటార్స్ ఈ ఆర్థిక ఏడాదికి సంబంధించిన క్యూ3 ఫలితాలను ప్రకటించింది. ఇందులో మొత్తం 9 శాతం పెరిగి 3,38,177 యూనిట్లుగా నమోదైంది. కమెర్షియల్ వెహికల్స్ కూడా 98,679 యూనిట్లు విక్రయించినట్లు కంపెనీ వెల్లడించింది. టాటా కార్లు సహా ఇతర ప్యాసింజర్ వాహనాల విక్రయాలు ప్రపంచ మార్కెట్లో 1,38,455 యూనిట్లు విక్రయించినట్టు తెలిపింది.

Post a Comment

0 Comments

Close Menu