Ad Code

10% కాంట్రాక్టు ఉద్యోగులపై డ్యూలింగో వేటు !


పెన్ఏఐ చాట్‌జీపీటీ లాంఛ్ అనంతరం ఇంటరాక్టివ్ ఏఐ చాట్‌బాట్స్‌, ఆర్టిఫిషియల్‌ ఇంటెలిజెన్స్ పై టెక్ ప్రపంచంలో హాట్ డిబేట్ ఊపందుకుంది. లేటెస్ట్ టెక్నాలజీతో తమ ఉద్యోగాలకు ఎసరొస్తుందని టెకీల్లో గుబులు రేగుతోంది. ఏఐతో మానవ నైపుణ్యాలకు పదునుపెట్టుకోవచ్చని, మెరుగైన టాస్క్‌లపై ఫోకస్ పెట్టడంతో పాటు ఉత్పాదకత పెరుగుతుందని కొందరు నిపుణులు చెబుతుండగా, ఏఐతో మనుషులు చేసే ఉద్యోగాలు పూర్తిగా కనమరుగవుతాయని మరికొందరు నిపుణులు హెచ్చరిస్తున్నారు. మనం చేసే పనుల్లో ఏఐతో సమూల మార్పులు తప్పవని మరికొందరు నిపుణులు చెబుతున్నారు. ఇక ల్యాంగ్వేజ్ లెర్నింగ్ సాఫ్ట్‌వేర్ కంపెనీ డ్యూలింగో కంటెంట్ క్రియేషన్‌లో జనరేటివ్ ఏఐ వాడుతూ వార్తల్లోకి ఎక్కింది. ఈ కంపెనీ ఇప్పటివరకూ మనుషులు చేసే పనులను ఏఐ టూల్స్‌కు మళ్లించడంతో తన కాంట్రాక్టు ఉద్యోగుల్లో 10 శాతం మందిని తొలగిస్తున్నట్టు కంపెనీ ప్రకటించింది. తమకు ఇంతమంది సేవలు అవసరం లేదని తొలగించిన ఉద్యోగుల పనులను పాక్షికంగా ఏఐకి అప్పగిస్తామని కంపెనీ ప్రతినిధి వెల్లడించారు ఈ కాంట్రాక్టర్లు చేసే పనిని ఎక్కవ మంది చేయాల్సిన అవసరం లేదని దాన్ని ఏఐకి అప్పగిస్తామని బ్లూంబర్గ్ రిపోర్ట్ పేర్కొంది. వేగంగా టెక్ట్స్‌, స్పీచ్‌, ఇమేజ్‌లను క్రియేట్ చేసేందుకు జనరేటివ్ ఏఐని వాడనున్నట్టు డ్యూలింగో సీఈవో లూయిన్ వన్ అన్ పేర్కొన్నారు. ఏఐ వాడకంతో కంపెనీ వేగంగా కంటెంట్ ప్రొడక్షన్‌తో పాటు, ల్యాంగ్వేజ్ లెర్నింగ్ షో స్క్రిప్ట్స్‌ను సిద్ధం చేస్తుందని చెప్పారు.

Post a Comment

0 Comments

Close Menu