Ad Code

అత్యధిక మైలేజీనిచ్చే హోండా షైన్ 125 బైక్


హోండా బైక్‌లు ఎక్కువ కాలం ఉండే ఇంజన్‌లు, అద్భుతమైన మైలేజీతో వస్తాయి. అందుకే వాటిపై ప్రజలకు ఉన్న నమ్మకం అచెంచలమైనది. ఈ కంపెనీ రెండు దశాబ్దాలకు పైగా భారత మార్కెట్లో షైన్ 125 బైక్ లను అమ్ముతోంది. గత రెండు దశాబ్దాలలో, కంపెనీ ఈ బైక్‌లో అనేక మార్పులను చేసింది, దీని కారణంగా దాని మైలేజ్, పనితీరు అద్భుతంగా మెరుగుపడింది. ఇది అత్యధిక మైలేజీనిచ్చే 125సీసీ బైక్‌లలో ఒకటి. సిటీ ట్రాఫిక్‌లో ఈ బైక్ ఒక లీటర్ పెట్రోల్‌లో 60 కిలోమీటర్ల వరకు మైలేజీని ఇస్తుంది. హోండా షైన్ రెండు వేరియంట్లలో అందుబాటులో ఉంది. డ్రమ్, డిస్క్ బ్రేక్, ధర వరుసగా రూ. 79,800, రూ. 83,800 గా ఉంది. ప్రాంతాన్ని బట్టి ఈ ధరలలో చిన్న వ్యత్సాసం ఉండవచ్చు. మీరు సైన్ 125 డిస్క్‌ని కొనుగోలు చేస్తే, ఈ బైక్ ఆన్-రోడ్ ధర రూ. 96,833 కి అందుబాటులో ఉంటుంది. ఇందులో ఆర్టీఓ ఛార్జీలు రూ.6,704, బీమా రూ.6,329.

Post a Comment

0 Comments

Close Menu