Ad Code

14 నుంచి ఫ్లిప్‌కార్ట్ రిపబ్లిక్ డే సేల్ !


ఫ్లిప్‌కార్ట్ రిపబ్లిక్ డే సేల్ జనవరి 14న ప్రారంభం కానుంది. తన ప్లాట్‌ఫారమ్‌లలో రాబోయే సేల్ ఈవెంట్ టీజర్‌ను రివీల్ చేసింది. తక్కువ ధరకు లభించే ఫోన్‌ల జాబితాను కూడా వెల్లడించింది. ఈ టీజర్ పేజీలో వెల్లడించిన వివరాల ప్రకారం.. రాబోయే ఫ్లిప్‌కార్ట్ సేల్ జనవరి 19 వరకు కొనసాగుతుంది. ప్రస్తుతానికి ఫ్లిప్‌కార్ట్ అన్ని డీల్స్ గురించి కచ్చితమైన ధర వివరాలను వెల్లడించలేదు. అయితే, ఫ్లిప్‌కార్ట్ రిపబ్లిక్ డే సేల్‌లో పెద్ద డిస్కౌంట్లను పొందే పాపులర్ ఫోన్‌ల పేర్లను ధృవీకరించింది. అందులో ప్రధానంగా ఆపిల్ ఐఫోన్ 15, ఐఫోన్ 14, ఐఫోన్ 13, ఐఫోన్ 12 వంటి ఆపిల్ డివైజ్‌లు ఎక్కువగా డిస్కౌంట్లను అందుకోనున్నాయి. ఆండ్రాయిడ్ ఫోన్లలో గూగుల్ పిక్సెల్ 7ఎ, శాంసంగ్ గెలాక్సీ ఎస్21 ఎఫ్ఈ 5జీ, మోటోరోలా ఎడ్జ్ 40 నియో, శాంసంగ్ గెలాక్సీ ఎస్22 5జీ, పిక్సెల్ 8, వివో టీ2 ప్రో, ఒప్పో రెనో 10 ప్రో, వివో టీ2ఎక్స్, పోకో ఎక్స్5, రియల్‌మి 11, రెడ్‌మి12, శాంసంగ్ గెలాక్సీ ఎఫ్ 34 వంటి మరిన్ని ఫోన్లపై భారీ తగ్గింపు ధరలకు విక్రయించనుంది. రిపబ్లిక్ డే సేల్ ఈవెంట్‌కు ముందు ఐఫోన్ 15 వంటి ఫోన్‌లు ఇప్పటికే ఫ్లిప్‌కార్ట్‌లో చాలా తక్కువ ధరకు అమ్ముడవుతున్నాయి. బేస్ 128జీబీ స్టోరేజ్ మోడల్ కోసం రూ.72,999కి లిస్టు అయింది. వాస్తవానికి దేశ మార్కెట్లో ఐఫోన్ 15 రూ. 79,900కి లాంచ్ కాగా.. వినియోగదారులు రూ.6,901 భారీ తగ్గింపును పొందవచ్చు.


Post a Comment

0 Comments

Close Menu