దేశీయ మార్కెట్లో జనవరి 17న టాటా పంచ్ Ev లాంచింగ్ చేయబోతున్నారు. లాంచ్ అయిన వెంటనే డెలివరీలు ప్రారంభిస్తారు. Ev సెగ్మెంట్ లో టాటా పంచ్ EV అత్యంత సరసమైన ఎలక్ట్రిక్ SUVగా నిలవనుంది. ఒక్కసారి ఛార్జ్ చేస్తే ఈ కారులో 300 కిలోమీటర్లు ప్రయాణం చేయొచ్చు. టాటా కంపెనీ అంతకుముందు వచ్చిన మరో ఈవీ SUV టాటా నెక్సాన్ ఫేస్‌లిఫ్ట్ తో పోలిస్తే, టాటా పంచ్ EV మరింత భిన్నంగా కనిపిస్తుంది. ఈ వెహికిల్ లో క్లోజ్డ్-ఆఫ్ గ్రిల్, స్లిమ్ LED హెడ్‌ల్యాంప్‌లు ఉంటాయి. టాటా పంచ్ EVలో 10.25-అంగుళాల టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్ ఉంటుంది. అలాగే కొత్త ఇల్యూమినేటెడ్ టాటా లోగోతో కూడిన టూ-స్పోక్ స్టీరింగ్ వీల్ తో పాటు 360 డిగ్రీ కెమెరా, వెంటిలేషన్‌తో ఉన్న లెథెరెట్ సీట్లు, ఆటో హోల్డ్‌తో ఎలక్ట్రానిక్ పార్కింగ్ బ్రేక్, వైర్‌లెస్ ఛార్జింగ్, కార్ టెక్, క్రూయిజ్ కంట్రోల్, సన్‌రూఫ్ తదితర ఫీచర్స్ ఉంటాయి. దీని ఎక్స్ షోరూమ్ ధర రూ. 11-14 లక్షల మధ్య ఉండొచ్చని భావిస్తున్నారు. టాటా డీలర్స్ వద్ద టోకెన్ అమౌంట్ గా రూ. 21,000 చెల్లించి టాటా ఈవీ పంచ్ ను బుక్ చేసుకోవచ్చు. బుకింగ్ ఆర్డర్స్ ప్రకారం డెలివరీ ఉంటుందని టాటా మోటార్స్ సంస్థ చెబుతోంది.
0 Comments