Ad Code

మైక్రోసాఫ్ట్‌ నుంచి 1,900 మంది తొలగింపు ?


మైక్రోసాఫ్ట్‌ తమ యాక్టివిజన్ బ్లిజార్డ్‌తో సహా దాని వీడియో-గేమ్ విభాగాలలో 1,900 మంది ఉద్యోగులను తొలగిస్తోంది. యాక్టివిజన్ బ్లిజార్డ్‌ను మైక్రోసాఫ్ట్‌ కార్పొరేషన్‌ గత ఏడాది 69 బిలియన్‌ డాలర్లకు కొనుగోలు చేసింది. ఈ మేరకు మైక్రోసాఫ్ట్‌ ఉద్యోగులకు పంపిన ఈ మెయిల్‌ను బ్లూమ్‌బెర్గ్ వార్తా సంస్థ సమీక్షించింది. మైక్రోసాఫ్ట్ 22,000 మంది గేమింగ్ వర్కర్లలో 8 శాతం మంది తొలగించనున్నట్లు ఈమెయిల్‌లో మైక్రోసాఫ్ట్ గేమింగ్ చీఫ్ ఫిల్ స్పెన్సర్ పేర్కొన్నారు. మైక్రోసాఫ్ట్ యాక్టివిజన్ బ్లిజార్డ్ కొనుగోలును ఖరారు చేసిన మూడు నెలల్లోనే ఉద్యోగుల తొలగింపులు చేపట్టడం గమనార్హం. భవిష్యత్తుకు అనుగుణంగా తమ వనరులను రీసెట్ చేయడానికే తొలగింపులు చేపడుతున్నట్లు యాక్టివిజన్ పబ్లిషింగ్ చీఫ్ రాబ్ కోస్టిచ్ ఉద్యోగులకు పంపిన ఈమెయిల్‌లో పేర్కొన్నట్లు బ్లూమ్‌బెర్గ్ నివేదించింది.

Post a Comment

0 Comments

Close Menu