Ad Code

బోట్‌ ఎనిగ్మా జెడ్‌20 స్మార్ట్‌ వాచ్‌ విడుదల

దేశీయ మార్కెట్లో బోట్‌ ఎనిగ్మా జెడ్‌20 పేరుతో కొత్త స్మార్ట్‌ వాచ్‌ను లాంచ్‌ చేసింది. తక్కువ బడ్జెట్‌లో హై-టెన్సైల్ మెటల్‌తో ఈ వాచ్‌ను చాలా ధృడంగా రూపొందించారు. ఈ వాచ్‌ను రబ్టర్‌ స్ట్రాప్‌, లెదర్‌ స్ట్రాప్‌లో తీసుకొచ్చారు. రబ్బర్‌ స్ట్రాస్‌తో వచ్చే వాచ్‌ ధర రూ. 3,299కాగా, బ్రౌన్‌ లెదర్‌ స్ట్రాప్‌ వాచ్‌ ధర రూ. 3499గా నిర్ణయించారు. రౌండ్ డిస్‌ప్లే డిజైన్‌తో తీసుకొచ్చింది. 1.51 ఇంచెస్‌తో కూడిన హచ్‌డీ ఎల్‌సీడీ స్క్రీన్ను అందించారు. 360x360 రిజల్యూషన్, 600 నిట్‌ల వరకు బ్రైట్‌నెస్‌ ఈ స్క్రీన్ సొంతం. బ్లూటూత్ కాలింగ్‌ సపోర్ట్‌ను ఇచ్చారు. ఇందుకోసం మైక్రో స్పీకర్‌ను అందించారు. బ్లూటూత్ 5.0 కనెక్టివిటీ ఉంది. వాచ్‌లో 250 కాంటాక్ట్‌లను సేవ్ చేసుకోవచ్చు. ఎమర్జెన్సీ SOS ఫీచర్‌ కూడా ఉంది. హార్ట్‌బీట్ మానిటర్, SpO2తో పాటు ఫిట్‌నెస్ ట్రాకర్లను అందించారు. వాయిస్ అసిస్టెంట్ సపోర్ట్, బిల్ట్-ఇన్ గేమ్‌లు, మ్యూజిక్ కంట్రోల్, అలారం వంటి ఫీచర్లను అందించారు. అలాగే దుమ్ము, ధూళి నుంచి రక్షణ కోసం IP68 రేటింగ్‌ను ఇచ్చారు. 

Post a Comment

0 Comments

Close Menu