Ad Code

ఫిబ్రవరి 29 నుంచి ఈ సేవలు నిలిపివేయాలని ఆర్బీఐ ఆదేశాలు


పేటీఎం పేమెంట్స్ బ్యాంక్‌పై రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియాతీవ్ర చర్యలకు ఉపక్రమించింది. కొత్త కస్టమర్లను చేర్చుకోవద్దని ఆ సంస్థకు ఆదేశాలు జారీ చేసింది. ఫిబ్రవరి 29వ తేదీ నుంచి వాలెట్లు, ఫాస్ట్‌ట్యాగ్‌లు, డిపాజిట్ లేదా క్రెడిట్ లావాదేవీలు, టాప్-అప్స్ వంటివి అనుమతించబడవని పేర్కొంది. అయితే కస్టమర్లు తమ ఖాతాలో ఉన్న బ్యాలెన్స్‌ని ఎలాంటి సమస్య లేకుండా విత్‌డ్రా చేసుకునేందుకు ఆర్బీఐ అనుమతి ఇచ్చింది. దీంతో పాటుగా పేటీఎం మాతృసంస్థ One97 కమ్యూనికేషన్స్ లిమిటెడ్, పేటీఎం పేమెంట్స్ బ్యాంక్ లిమిటెడ్ లేదా పీబీబీఎల్ నోడల్ ఖాతాలను కూడా రిజర్వ్ బ్యాంక్ రద్దు చేసింది. అయితే ఈ ఆంక్షలు పేటీఎం యూనిఫైడ్ పేమెంట్ ఇంటర్‌ఫేస్ (యూపీఐ)పై ఎలాంటి ప్రభావం చూపదని ఆర్బీఐ తెలిపింది. 

Post a Comment

0 Comments

Close Menu