Ad Code

త్వరలో డైరెక్ట్ 2 మొబైల్ సేవలు ?


నెట్ వర్క్, ఇంటర్నెట్ అవసరం లేకుండా ఎంటర్టైన్మెంట్ ను నేరుగా మొబైల్ లలో ఆస్వాదించేలా కొత్త ఇంటర్నెట్ డైరెక్ట్ 2 మొబైల్ సేవలను  ప్రభుత్వం తీసుకు వచ్చింది.  ఈ సర్వీస్ ను మొదటిగా తీసుకు వచ్చిన ఘనత కూడా మన దేశానికే దక్కుతుంది. డైరెక్ట్ టు మొబైల్ గురించి అర్ధమయ్యేలా చెప్పడానికి D2H మాదిరిగా పామి చేస్తుందని చెప్పినా, ఇది చేసే పనులు నెక్స్ట్ లెవెల్లో ఉంటాయి. ఎందుకంటే, ఈ కొత్త సర్వీస్ ల కోసం ప్రభుతం కొత్త అడ్వాన్స్డ్ టెక్నలాజిని ఉపయోగించింది. కొత్త తరానికి తగిన ఫలితాల కోసం తీసుకు వచ్చిన డైరెక్ట్ టూ మొబైల్ సర్వీస్ టెక్నాలజీ, యూజర్లు కోరుకునే ఆన్ డిమాండ్ కంటెంట్ మరియు ఇంటరాక్టివ్ సర్వీస్ లకు అనుకూలంగా ఉంటుంది. ఈ సర్వీస్ లు అందుబాటులోకి వస్తే స్మార్ట్ ఫోన్ యూజర్లు ఎటువంటి డేటా ప్లాన్స్ అవసరం లేకుండా హాయ్ క్వాలిటీలో కంటెంట్ ను చేసే వీలుంటుంది. దేశంలోని 19 సిటీలలో ఈ డైరెక్ట్ టు మొబైల్ యొక్క పైలెట్ ప్రాజెక్ట్ ను ప్రారంభించే దిశగా ప్రభుత్వం అడుగులు వేస్తోంది. అయితే, పూర్తిస్థాయి సేవల కోసం మరికొంత కాలం వేచి చూడాల్సి వస్తుంది.

Post a Comment

0 Comments

Close Menu