Ad Code

హానర్ మ్యాజిక్ వీ2 ఫోల్డబుల్ స్మార్ట్ ఫోన్


హానర్ కంపెనీ హానర్ మ్యాజిక్ వీ2 ఫోల్డబుల్ స్మార్ట్ ఫోన్ ను లాంచ్ చేసింది. ఇది ప్రపంచంలోనే అత్యంత పలుచని ఫోల్డబుల్ స్మార్ట్ ఫోన్ గా కంపెనీ ప్రకటించుకుంది. కేవలం 9.9ఎంఎం థిక్ నెస్ ఉంటుందని చెప్పింది. మంచి స్పెసిఫికేషన్లు, ఆకట్టుకునే కెమెరాలు ఉంటాయని పేర్కొంది. దీనిని ప్రస్తుతానికి చైనాలో ఆవిష్కరించగా, యూకే సహా యూరోప్ లోని కొన్ని దేశాల్లో కూడా అందుబాటులో ఉంది.  ఈ ఫోల్డబుల్ ఫోన్లో విభిన్నమైన డిస్ ప్లే ఉంటుంది. దీని బయటవైపు స్క్రీన్ 6.43 అంగుళాలతో 120హెర్జ్ రిఫ్రెష్ రేటుతో ఓఎల్ఈడీ డిస్ ప్లే, ఎల్టీపీఓ కవర్ స్క్రీన్ తో శక్తివంతమైన విజువల్స్ ను అందిస్తుంది. 20:9 యాస్పెక్ట్ రేషియో ఉంటుంది. 2,500నిట్స్ పీక్ బ్రైట్నెస్ ను కలిగి ఉంటుంది. ఈ స్క్రీన్ సంరక్షణకు నానో క్రిస్టల్ గ్లాస్ ప్రోటెక్షన్ 7.92 అంగుళాల ఎల్టీపీవో ఓఎల్ఈడీ ప్యానల్ ను కలిగి ఉంటుంది. ఈ స్మార్ట్ ఫోన్లో 16ఎంపీ సెల్ఫీ కెమెరాలు ఉంటాయి. వెనుకవైపు 50ఎంపీ ప్రధాన కెమెరా, 50ఎంపీ అల్ట్రా వైడ్ లెన్స్, 2.5x 20ఎంపీ టెలిఫోటో కెమెరాతో సహా ట్రిపుల్ కెమెరా సెటప్ ఉంటుంది. స్నాప్ డ్రాగన్ 8 జెన్ 2 ప్రాసెసర్ ఉంటుంది. ఇది 16జీబీ ర్యామ్, 512 జీబీ ఇంటర్నల్ స్టోరేజ్ తో వస్తుంది. బ్యాటరీ సామర్థ్యం కూడా 5000ఎంఏహెచ్ ఉంటుంది. ఇది డ్యూయల్ సిలికాన్ కార్బన్ బ్యాటరీ. యూరోప్ లో దీని దర 1,699.99యూరోలుగా నిర్ణయించారు. అంటే మన కరెన్సీలో రూ. 1,53,507.56గా ఉంటుంది. ఇది బ్లాక్ వేగన్ లెదర్, ఫాంటమ్ పర్పుల్ కలర్ ఆప్షన్లలో లభ్యమవుతోంది. ఫిబ్రవరీ 2 నుంచి అమ్మకాలు ప్రారంభమవుతాయి.

Post a Comment

0 Comments

Close Menu