Ad Code

4న రెడ్‌మి నోట్ 13 5జీ సిరీస్ విడుదల


దేశీయ మార్కెట్లో 4న రెడ్‌మి నోట్ 13 5జీ సిరీస్లాంచ్ కానుంది. ఇంతకుముందు చైనాలో లాంచ్ అయిన మిడ్-రేంజ్ స్మార్ట్‌ఫోన్ సిరీస్ రెడ్‌మి నోట్ 13 5జీ, రెడ్‌మి నోట్ 13 ప్రో 5జీ, రెడ్‌మి నోట్ 13ప్రో + 5జీ అనే మూడు వేరియంట్‌లలో అందుబాటులోకి రానుంది. రెడ్‌మి నోట్ 13 5జీ ఫోన్ వనిల్లా వేరియంట్ 2400*1080 పిక్సెల్‌ల రిజల్యూషన్‌తో 6.67-అంగుళాల అమోల్డ్ డిస్‌ప్లేను కలిగి ఉంటుందని లీక్ అయిన స్పెసిఫికేషన్‌లు సూచిస్తున్నాయి. ఈ స్మార్ట్‌ఫోన్ గరిష్టంగా 120హెచ్‌జెడ్ రిఫ్రెష్ రేట్, 240హెచ్‌జెడ్ వరకు టచ్ శాంప్లింగ్ రేట్‌తో రానుందని తెలుస్తుంది.. 108ఎంపీ ప్రధాన కెమెరా, 8ఎంపీ అల్ట్రా-వైడ్ లెన్స్, 2ఎంపీ మాక్రో సెన్సార్‌ను కలిగి ఉంటుంది. సెల్ఫీలు, వీడియో కాల్‌లకు 16ఎంపీ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా ఉంటుంది. 4ఎన్ఎమ్ ప్రాసెస్ ఆధారంగా గ్రాఫిక్స్-ఇంటెన్సివ్ టాస్క్‌ల కోసం అడ్రినో 710 జీపీయూ ఆధారంగా స్నాప్‌డ్రాగన్ 7ఎస్ జెన్ 2 ప్రాసెసర్ ద్వారా పవర్ అందిస్తుందని భావిస్తున్నారు. ఈ స్మార్ట్‌ఫోన్ 8జీబీ ఎల్‌పీడీడీఆర్5 ర్యామ్, 256జీబీ వరకు యూఎఫ్ఎస్ 3.1 స్టోరేజ్‌తో వస్తుండగా,నోట్ 13 ప్రో ప్లస్ 5జీ మాలి-జీ610 ఎంసీ4 జీపీయూతో జత చేసిన మీడియాటెక్ డైమెన్సిటీ 7200 అల్ట్రా ప్రాసెసర్‌తో అందిస్తుందని భావిస్తున్నారు. ఈ స్మార్ట్‌ఫోన్ 12జీబీ వరకు ఎల్‌పీడీడీఆర్5 ర్యామ్ వేరియంట్‌లలో 512జీబీ వరకు యూఎఫ్ఎస్ 3.1 స్టోరేజ్ వెరియంట్లలో రాబోతుందని తెలుస్తుంది. రెడ్‌మి నోట్ 13 5జీ ఫోన్ 6జీబీ ర్యామ్/128జీబీ స్టోరేజ్ వేరియంట్‌కు రూ. 20,999, 8జీబీ ర్యామ్/256జీబీ స్టోరేజ్ వేరియంట్‌కి రూ. 22,999, రూ. 24,9299 ర్యామ్/256జీబీ స్టోరేజ్ వేరియంట్ అందిస్తుంది. అంతేకాకుండా, స్మార్ట్‌ఫోన్ ప్రిజం గోల్డ్, ఆర్కిటిక్ వైట్, స్టెల్త్ బ్లాక్ కలర్ ఆప్షన్‌లలో అందుబాటులో ఉంటుంది.

Post a Comment

0 Comments

Close Menu