Ad Code

రెడ్‌మీ వాచ్‌ 4 విడుదల


ప్రపంచవ్యాప్తంగా రెడ్‌మీ వాచ్‌ 4 విడుదల అయింది. ఈ స్మార్ట్‌వాచ్‌ చతురస్రాకార డయల్‌ మరియు అల్యూమినియం ప్రేమ్‌ డిజైన్‌ను కలిగి ఉంది. పీపీజీ సెన్సార్‌ సహా అనేక హెల్త్‌ ట్రాకర్లను కలిగి ఉంది. సింగిల్‌ ఛార్జింగ్‌తో 20 రోజులపాటు బ్యాటరీ లైఫ్‌ను ఇస్తోంది. ధర $107 (భారత కరెన్సీలో రూ.8,890) గా ఉంది. సిల్వర్‌ గ్రే లేదా ఒబ్సిడియన్‌ బ్లాక్‌ రంగుల్లో కొనుగోలు చేయవచ్చు. మరియు మ్యాచింగ్‌ స్ట్రిప్‌ తో వస్తుంది. పాస్టెల్‌ పర్పల్‌, డార్క్‌ సియాన్‌ లేదా మింట్‌ గ్రీన్‌ రంగుల్లో స్మార్ట్‌వాచ్‌ను కొనుగోలు చేయవచ్చు. 1.97 అంగుళాల అమోలెడ్ డిస్‌ప్లేను కలిగి ఉంది. 390x450 పిక్సల్‌ రిజల్యూషన్‌ మరియు 600 నిట్‌ల వరకు గరిష్ఠ బ్రైట్‌నెస్‌తో వస్తుంది. షియోమీ హైపర్‌ OS ను కలిగి ఉంటుంది. ఈ స్మార్ట్‌వాచ్‌ 150 కి పైగా స్పోర్స్ట్‌ మోడ్‌లు మరియు ఫిట్‌నెస్‌, హెల్త్‌ ట్రాకర్లతోపాటు రోజువారీ కార్యకలాపాలను ట్రాక్‌ చేయనుంది. హార్ట్‌ బీట్‌ రేట్‌, SpO2, నిద్ర నాణ్యతను పర్యవేక్షిస్తుంది. వాటర్‌ ఫ్రూఫ్‌ డిజైన్‌ను కలిగి ఉంటుంది. రెడ్‌మీ వాచ్‌ 4.. 470mAh బ్యాటరీ ప్యాక్‌ను కలిగి ఉంటుంది. 

Post a Comment

0 Comments

Close Menu