Ad Code

తమిళనాడులో హ్యుందాయ్‌ మరో రూ.6 వేల కోట్ల పెట్టుబడులు !

హ్యుందాయ్‌ మోటార్‌ ఇండియా తమిళనాడులో భారీ పెట్టుబడులు పెట్టేందుకు సిద్ధమైంది. కొత్త ప్రాజెక్ట్‌ల కోసం ఆ రాష్ట్రంలో మరో రూ.6,180 కోట్ల పెట్టుబడులు పెట్టనున్నట్లు సోమవారం తెలిపింది. తమిళనాడు 'గ్లోబల్‌ ఇన్వెస్టర్స్‌ 2024' కార్యక్రమంలో రాష్ట్ర ప్రభుత్వంతో ఒప్పందం చేసుకున్నట్లు పేర్కొంది. ఈ మొత్తం గతంలో ప్రకటించిన పెట్టుబడులకు అదనమని వెల్లడించింది. హ్యుందాయ్‌ సంస్థ రాబోయే పదేళ్లలో (2023-2032) తమిళనాడులో రూ.20 వేల కోట్లతో విద్యుత్తు వాహనాల (EV) తయారీ, ఈవీ ఛార్జింగ్‌ సదుపాయాలు ఏర్పాటు చేయడంతోపాటు నైపుణ్య శిక్షణ కోసం పెట్టుబడులు పెట్టనున్నట్లు గతంలో ప్రకటించింది. రాష్ట్రంలో సామాజిక-ఆర్థికాభివృద్ధిని పెంపొందించేందుకు తమ సంస్థ నిబద్ధతకు ఈ పెట్టుబడులు నిదర్శనమని హ్యుందాయ్‌ ఎండీ ఉన్‌సూ కిమ్‌ తెలిపారు. పెట్టుబడుల్లో భాగంగా ఈ సంస్థ రూ.180 కోట్లతో ఐఐటీ మద్రాస్‌తో కలిసి తమిళనాడులో హైడ్రోజన్‌ వ్యాలీ ఇన్నోవేషన్‌ హబ్‌ను ఏర్పాటు చేయనుంది. భారత్‌లో ఈ సంస్థకు చెన్నై నగరం శివారులో అతి పెద్ద తయారీ యూనిట్‌ ఉంది. ఏటా ఇక్కడి నుంచి 8 లక్షల కార్లను ఉత్పత్తి చేస్తోంది.

Post a Comment

0 Comments

Close Menu