Ad Code

సేల్స్‌ఫోర్స్ లో 700 మంది ఉద్యోగుల తొలగింపు


మెరికాకు చెందిన క్లౌడ్ ఆధారిత సాఫ్ట్‌వేర్ కంపెనీ సేల్స్‌ఫోర్స్ దాదాపు 700 మంది ఉద్యోగులను తొలగిస్తోందని వాల్ స్ట్రీట్ జర్నల్‌ను ఉటంకిస్తూ రాయిటర్స్ వార్తా సంస్థ నివేదించింది. అమెజాన్, గూగుల్ వంటి టెక్‌ దిగ్గజాలు ప్రకటించిన లేఆఫ్‌లతో ఇప్పటికే అమెరికాలో తొలగింపుల తరంగం కొనసాగుతుండగా ఇందులో తాజాగా సేల్స్‌ఫోర్స్‌ చేరింది. సేల్స్‌ఫోర్స్ గత సంవత్సరం 10 శాతం ఉద్యోగాలను తగ్గించింది. కొన్ని కార్యాలయాలను మూసివేసింది. అయితే మార్జిన్‌లను పెంచడానికి 3,000 మందికి పైగా ఉద్యోగులను తీసుకుంటామని గడిచిన సెప్టెంబరులో కంపెనీ తెలిపింది. కొత్త ప్రారంభమైనప్పటి నుంచి టెక్‌ పరిశ్రమలో వరుస లేఆఫ్‌లు కొనసాగుతున్నాయి. Layoffs.fyi పోర్టల్ ప్రకారం.. 2024 ప్రారంభం నుంచి 85 టెక్ కంపెనీలు 23,770 మంది ఉద్యోగులను తొలగించాయి. ఈ వారం మైక్రోసాఫ్ట్ తన గేమింగ్ డివిజన్ యాక్టివిజన్ బ్లిజార్డ్‌లో 1,900 మంది ఉద్యోగులను తొలగిస్తున్నట్లు తెలిపింది. అలాగే ఆన్‌లైన్ రిటైలర్ ఈబే దాదాపు 1,000 మంది ఉద్యోగుల తొలగింపులను కూడా ప్రకటించింది.

Post a Comment

0 Comments

Close Menu