గూగుల్ పిక్సల్ 8 సిరీస్ స్మార్ట్‌ఫోన్లు మరో కొత్త కలర్ వేరియంట్‌లో త్వరలో అందుబాటులోకి రానున్నాయి. ఈ సిరీస్ స్మార్ట్‌పోన్లు లాంచ్ అయిన నాలుగు నెలల తర్వాత ఈ కొత్త వేరియంట్ లాంచ్ అవుతోంది. ఇప్పటికే పిక్సల్ 8 హ్యాండ్‌సెట్ హజెల్, ఒబ్సిడియన్, రోజ్ రంగుల్లో లభిస్తోంది. ప్రో మోడల్ బే, ఒబ్సిడియన్, పింగాణీ రంగుల్లో లభిస్తోంది. ఈ గూగుల్ పిక్సల్ 8, 8 ప్రో స్మార్ట్‌ఫోన్లు గూగుల్ టెన్సార్ G3 ప్రాసెసర్‌ను కలిగి ఉన్నాయి. మరియు ఆండ్రాయిడ్ 14 OS పైన పనిచేస్తాయి. గూగుల్ పిక్సల్ 8 4575mAh బ్యాటరీ, ప్రో మోడల్ 5,050mAh బ్యాటరీ సామర్థ్యాన్ని కలిగి ఉన్నాయి. గూగుల్ సోషల్ మీడియా ఛానళ్లు కొత్త కలర్ వేరియంట్ మింటీ ఫ్రెష్ గ్రీన్ రంగులో స్మార్ట్‌ఫోన్ల చిత్రాలను ప్రచురించాయి. ఈ కొత్త కలర్ వేరియంట్ జనవరి 25న విడుదల కానుంది. ఈ కొత్త వేరియంట్ కూడా అవే ధరలను కలిగి ఉండే అవకాశం ఉంది. కొత్త ఫోన్లు గూగుల్ స్టోర్‌లోనే లభిస్తాయని తెలుస్తోంది. గూగుల్ పిక్సల్ 8, పిక్సల్ 8 ప్రో స్మార్ట్‌ఫోన్లు డ్యూయల్ సిమ్ ఆప్షన్‌ను కలిగి ఉంటాయి. మరియు ఆండ్రాయిడ్ 14 అవుట్ ఆఫ్ ది బాక్స్ పైన పనిచేస్తాయి. పిక్సల్ 8 ఫోన్ 6.2 అంగుళాల పుల్ HD+ OLED డిస్‌ప్లేను కలిగి ఉంటుంది. మరియు 90Hz రీఫ్రెష్ రేట్‌తో రానుంది. అదే పిక్సల్ 8 ప్రో 120Hz రీఫ్రెష్ రేట్‌తో 6.7 అంగుళాల క్వాడ్ HD స్క్రీన్‌ను కలిగి ఉంటుంది. ఈ రెండు స్మార్ట్‌ఫోన్లు గూగుల్ నానో కోర్ టెన్సర్ G3 చిప్‌సెట్ సహా టైటాన్ M2 సెక్యూరిటీ చిప్‌ను కలిగి ఉంటాయి. గూగుల్ పిక్సల్ 8, పిక్సల్ 8 ప్రో స్మార్ట్‌ఫోన్లు శాంసంగ్ GN2 సెన్సార్, f/1.68 అపేచర్‌తో 50MP ప్రైమరీ కెమెరాను కలిగి ఉంటుంది. దీంతోపాటు పిక్సల్ 8 సోనీ IMX386 సెన్సార్, f/2.2 అపేచర్‌తో 12MP ఆల్ట్రావైడ్ యాంగిల్ కెమెరాను కలిగి ఉంటుంది. అదే పిక్సల్ 8 ప్రో సోనీ IMX787 సెన్సార్, f/2.8 అపేచర్‌తో 64MP ఆల్ట్రావైడ్ యాంగిల్ కెమెరాలను కలిగి ఉంటుంది. దీంతోపాటు ప్రో మోడల్ శాంసంగ్ GMS సెన్సార్‌తో f/1.95 అపేచర్‌తో 48MP టెలీఫోటో కెమెరాను కలిగి ఉంటుంది. ఈ రెండు ఫోన్లు ముందువైపు f/2.2 అపేచర్‌తో 11MP కెమెరాను అమర్చారు. గూగుల్ పిక్సల్ 8 స్మార్ట్‌ఫోన్ 128GB అంతర్గత స్టోరేజీ వేరియంట్‌లోనే లభించనుంది. అలాగే పిక్సల్ 8 ప్రో 128GB స్టోరేజీ మోడల్ ఈ ఫోన్ బే, అబ్సిడియన్, పింగాణి రంగుల్లో లభిస్తుంది.
0 Comments