Ad Code

ఫిబ్రవరిలో ఐకూ నియో 9 ప్రో స్మార్ట్ ఫోన్ విడుదల


దేశీయ మార్కెట్లో ఐకూ నియో 9 ప్రో స్మార్ట్ ఫోన్ ఫిబ్రవరిలో లాంచ్ కానుంది. ఈ విషయాన్ని కంపెనీ సోషల్ మీడియా ద్వారా అధికారికంగా ప్రకటించింది. దీనికి సంబంధించిన మీడియా ఇన్ వైట్లు కూడా వెళ్లాయి. అమెజాన్ లో దీనికి సంబంధించిన సేల్ కూడా ప్రారంభం కానుంది. ఐకూ నియో 9 ప్రో ఇండియన్ వేరియంట్ క్వాల్కాం స్నాప్డ్రాగన్ 8 జెన్ 2 ప్రాసెసర్పై పని చేయనుంది. ఈ ఫోన్ డిసెంబర్ లోనే చైనాలో లాంచ్ అయింది. మీడియాటెక్ డైమెన్సిటీ ప్రాసెసర్ పై ఐకూ నియో 9 ప్రో చైనీస్ వేరియంట్ రన్ కానుంది. డ్యూయల్ టోన్ రెడ్ అండ్ వైట్ డిజైన్ లో ఐకూ నియో 9 ప్రో మార్కెట్లో ఎంట్రీ ఇవ్వనుంది. వెనకవైపు రెండు కెమెరాలు ఉన్నాయి. దీనికి సంబంధించిన ప్రత్యేకమైన వెబ్ పేజీ కూడా అమెజాన్ లో క్రియేట్ అయింది. ఈ లిస్టింగ్ ప్రకారం ఫోన్లో క్వాల్కాం స్నాప్డ్రాగన్ 8 జెన్ 2 ప్రాసెసర్ ఉండనుంది. ఇది చైనీస్ వేరియంట్ కంటే కాస్త డిఫరెంట్ ప్రాసెసర్ తో రానుంది. ఆండ్రాయిడ్ 14 ఆధారిత ఫన్టచ్ ఓఎస్ 14 ఆపరేటింగ్ సిస్టంపై ఈ ఫోన్ పని చేయనుంది. ఇందులో 6.78 అంగుళాల అమోఎల్ఈడీ డిస్ప్లే ఉండనుంది. 144 హెర్ట్జ్ స్క్రీన్ రిఫ్రెష్ రేట్ కూడా ఉండటం విశేషం. 16 జీబీ వరకు ఎల్పీడీడీఆర్5ఎక్స్ ర్యామ్, 1 టీబీ వరకు యూఎఫ్ఎస్ 4.0 ఇన్బిల్ట్ స్టోరేజ్ అందించనున్నారు. ఫోన్ వెనకవైపు రెండు కెమెరాలు ఉండనున్నాయి. వీటిలో ప్రధాన కెమెరా సామర్థ్యం 50 మెగాపిక్సెల్ కాగా, ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్ (ఓఐఎస్) ఫీచర్ కూడా ఇందులో ఉండనుంది. దీని బ్యాటరీ సామర్థ్యం 5160 ఎంఏహెచ్ కాగా, 120W వైర్డ్ ఫాస్ట్ ఛార్జింగ్ను కూడా సపోర్ట్ చేయనుంది. 16 మెగాపిక్సెల్ సెల్ఫీ కెమెరాను ముందువైపు అందించారు.


Post a Comment

0 Comments

Close Menu