Ad Code

ఈ ఏడాది ద్వితియార్థంలో గూగుల్‌ పిక్సెల్‌ 9 విడుదల ?


గూగుల్‌ పిక్సెల్‌ 9, పిక్సెల్‌ 9 ప్రో స్మార్ట్‌ ఫోన్‌లను గూగుల్‌ పిక్సెల్‌ ఈ ఏడాది ద్వితియార్థంలో విడుదల చేసేందుకు సిద్ధమవుతోంది. ఈ సిరీస్‌కు సంబంధించి ఇప్పటి వరకు ఎలాంటి అధికారిక ప్రకటన చేయకపోయినప్పటికీ, నెట్టింట ఈ ఫోన్‌కు సంబంధించి కొన్ని ఫీచర్లు లీక్‌ అవుతున్నాయి. డైమెన్షన్స్‌ను 360 డిగ్రీ వీడియోలో ఆవిష్కరించే 5కే రెండర్స్‌ను ఇవ్వనున్నారు. ఇందులో 6.5 ఇంచ్ ఫ్లాట్ డిస్‌ప్లేతో పాటు సెల్ఫీ కెమెరా కోసం పంచ్‌-హోల్ ఇవ్వనున్నట్లు తెలుస్తోంది. అలాగే రైట్‌ సైడ్‌ పవర్‌ బటన్‌, వాల్యూమ్ రాకర్స్‌తో పాటు ఫ్లాగ్‌షిప్ డివైజ్ ఫ్లాట్ ప్రేమ్‌ ఇవ్వనున్నట్లు సమాచారం. డివైజ్ కింది భాగంలో యూఎస్‌బీ టైప్‌-సీ పోర్ట్‌, స్పీకర్ గ్రిల్‌ వంటి అధునాతన ఫీచర్లను అందించనున్నారు.

Post a Comment

0 Comments

Close Menu