Ad Code

బీఎస్ఎన్ఎల్ నుంచి రెండు కొత్త ప్లాన్లు !


భారత్ సంచార్ నిగమ్ లిమిటెడ్(బీఎస్ఎన్ఎల్) ప్రైవేటు టెలికాం సంస్థలతో పోటీని తట్టుకొని నిలబడేందుకు ప్రయత్నాలు ముమ్మరం చేస్తోంది. గ్రామీణ భారతంలో బీఎస్ఎన్ఎల్ కు ఉన్న పట్టును మరింత బలోపేతం చేసుకునేందుకు తాపత్రయ పడుతోంది. ఈ క్రమంలోనే అనేక కొత్త ప్లాన్లను ప్రవేశపెడుతోంది. అతి తక్కువ ధరలోనే మంచి బెనిఫిట్స్ తో కూడిన ప్రీ పెయిడ్ ప్లాన్లను అందిస్తోంది. ఇటీవల తన కస్టమర్ల కోసం రెండు కొత్త ప్రీపెయిడ్ ప్లాన్‌లను తీసుకొచ్చింది. ఈ రెండు ప్లాన్‌లు రూ. 91, రూ. 288కి వస్తాయి. రెండు ప్లాన్‌లు ప్రీపెయిడ్ డేటా వోచర్‌లు. అంటే అవి సర్వీస్ చెల్లుబాటుతో రావు, డేటా ప్రయోజనాలను మాత్రమే అందిస్తాయి. అంతేకాక ఈ రెండు ప్లాన్‌లు భారతదేశం అంతటా అందుబాటులో లేవు. ప్రస్తుతానికి చెన్నై సర్కిల్‌లో నివసిస్తున్న వినియోగదారులకు మాత్రమే అందుబాటులో ఉన్నాయి. అయితే ఆయా సర్కిళ్లలో ఉన్న పరిస్థితిని బట్టి కస్టమర్ల డిమాండ్లను బట్టి ప్లాన్లను తీసుకొచ్చే అవకాశం ఉంది. కొత్త ప్రీ పెయిడ్ ప్లాన్ ధర రూ. 91. ఇది ఏడు రోజుల సర్వీస్ వ్యాలిడిటీతో మాత్రమే వస్తుంది. ఇది వినియోగదారులకు 600ఎంబీ డేటాతో పాటు 700ఎస్ఎంఎస్ లను అందిస్తుంది. కస్టమర్‌లకు బండిల్‌ చేసిన ఇతర ప్రయోజనాలేవీ లేవు. ఈ ప్లాన్‌ని ఉపయోగించడానికి మీరు బేస్ ప్రీపెయిడ్ ప్లాన్ యాక్టివ్ చేసుకొని ఉండాలి. రూ. 91 ప్లాన్ ఎక్కువ డేటాను కోరుకునే వినియోగదారులకు ఉపయోగపడదు. అయితే ఇది ప్రధానంగా ఎస్ఎంఎస్ ప్రయోజనాలతో పాటు కొద్ది పాటి డేటాను వినియోగించే వారికి ఉపయుక్తంగా ఉంటుంది. అధిక డేటా వినియోగం అవసరం ఉన్న వారు దీనిని వదిలేయొచ్చు. రూ. 288 ప్రీ పెయిడ్ ప్లాన్ 60 రోజుల వ్యాలిడిటీతో వస్తుంది. ఈ ప్యాక్ లో ప్రతి రోజూ 2జీబీ డేటా వస్తుంది. 2జీబీ ఎఫ్యూపీ(ఫెయిర్ యూసేజ్ పాలసీ) డేటా వినియోగం తర్వాత అ ప్లాన్ అందించే డేటా వేగం 40 కేబీపీఎస్ కు తగ్గుతుంది. ఎఫ్ యూపీ డేటా పరిమితి ప్రతి రోజూ మీకు రిఫ్రెస్ అవుతుంది. నిర్ణీత టైం పీరియడ్ లో రోజు ముగుస్తుందని ఆ రోజు డేటా ముగిసిపోయి, కొత్తగా మళ్లీ డేటా రీసెట్ అవుతుంది. ఇది డేటా ఎక్కువగా వినియోగించే వారికి చాలా ఉపయుక్తంగా ఉంటుంది.

Post a Comment

0 Comments

Close Menu