Ad Code

విద్యార్థిని ప్రాణాలను కాపాడిన ఆపిల్ స్మార్ట్‌వాచ్‌ !


మెరికాలోని డెలావర్‌కు చెందిన నటాలీ తన రూంలోనే మెల్లగా స్పృహ కోల్పోతున్న పరిస్థితి ఎదురైంది. ఆమె రూంలో అత్యంత ప్రమాదకరమైన కార్బన్‌ మోనాక్సైడ్‌ లీక్‌ అవుతోంది. కార్బన్‌ మోనాక్సైడ్‌ పీల్చడం చాలా ప్రమాదకరం మరియు ప్రాణంతకం. అయితే ఆమెకు ఈ విషయం తెలియదు. కానీ పరిస్థితి చేయిదాటుతోందని మాత్రం అర్థం అయింది. అయితే అదే సమయంలో ఆమె చేతికి ఆపిల్‌ స్మార్ట్‌వాచ్‌ ఉంది. దీనిలో SOS ఫీచర్‌ ఉంది. పరిస్థితి ఆందోళనకరంగా మారుతోందని భావించిన నటాలీ వెంటనే SOS ఫీచర్‌ను ఉపయోగించింది. ఈ ఫీచర్‌లో ఉన్న సాంకేతికత ద్వారా ఆ సమీపంలోనే అత్యవసర సేవల విభాగం సహా అగ్నిమాపక శాఖకు సమాచారం వెళ్లింది. దీంతో లోకేషన్‌ ఆధారంగా అత్యవసర సేవల సిబ్బంది ఆమె రూంకు చేరుకున్నారు. అప్పటికే మంచంపై పడి ఉన్న నటాలీని రూం నుంచి బయటకు తీసుకొచ్చారు. వెంటనే హాస్పిటల్‌కు తరలించారు. సమయానికి చికిత్స అందడంతో ఆమె ప్రాణాలతో బయటపడ్డారు. దీంతో ఆపిల్‌ సంస్థకు ఆమె కృతజ్ఞతలు తెలిపారు. ఆపిల్‌ స్మార్ట్‌వాచ్‌లు చాలా కచ్చితత్వంతో పనిచేస్తాయి. ఇందులో అనేక హెల్త్ ట్రాకర్లు ఉన్నాయి. హార్ట్‌ రేట్‌ మానిటర్‌, spO2 స్థాయిలకు తనిఖీ చేయడం సహా SOS వంటి కీలక ఫీచర్లను కలిగి ఉంది. ఈ ఫీచర్‌ను చిన్న బటన్‌ క్లిక్‌ చేయడం ద్వారా అత్యవసర సమయాల్లో వినియోగించుకోవచ్చు.

Post a Comment

0 Comments

Close Menu