వ్యాపారస్తులకు లాభదాయకంగా ఉండే గూగుల్ బిజినెస్ ప్రొఫైల్ వెబ్‌సైట్‌ను శాశ్వతంగా షట్‌డౌన్ చేస్తున్నట్లు గూగుల్ ప్రకటించింది. మార్చి నెలలో ఈ వెబ్‌సైట్‌ను తొలగిస్తున్నట్లు తెలిపింది. అనంతరం ఎవరైనా ఈ బిజినెస్ ప్రొఫైల్ వెబ్‌సైట్‌ను ఓపెన్ చేస్తే డైరెక్ట్‌గా కస్టమర్ల బిజినెస్ ప్రొఫైల్‌లోకి వెళ్తారని పేర్కొంది. గూగుల్ బిజినెస్ ప్రొఫైల్ అనేది గూగుల్ సెర్చ్, మ్యాప్స్‌లో వారి వ్యాపారానికి సంబంధించిన అడ్రస్‌లు డిస్‌ప్లే చేసుకోవచ్చు. ఈ సదుపాయాన్ని గూగుల్ వ్యాపారాలు నిర్వహించే వారికి ఉచితంగా అందిస్తుంది. బిజినెస్ ప్రొఫైల్‌తో వినియోగదారులు కస్టమర్‌లతో కనెక్ట్ అవ్వవచ్చు. అప్‌డేట్‌లను పోస్ట్ చేయవచ్చు. వారి ప్రొడక్ట్‌లు, అందిస్తున్న సేవల గురించి చెప్పొచ్చు. గూగుల్ బిజినెస్ ప్రొఫైల్ షట్‌డౌన్ అవుతుంది. మరి దీనికి ప్రత్యామ్నాయ మార్గం ఏంటనే అంశంపై అనేక సందేహాలు వ్యక్తమయ్యాయి. దీంతో గూగుల్ బిజినెస్ ప్రొఫైల్‌ను వినియోగించే బదులు సొంతంగా కొత్త వెబ్‌సైట్‌ను తయారు చేసుకోవడంతో పాటు అందులో మీ బిజినెస్ అడ్రస్‌తో పాటు బిజినెస్ ప్రొఫైల్‌ను అప్‌డేట్ చేసుకోవడం మంచిదని గూగుల్ యూజర్లకు సూచించింది.
0 Comments