బెంగళూర్‌లో అత్యాధునిక వసతులతో యాపిల్ నూతన కార్యాలయాన్ని ప్రారంభించింది. నూరు శాతం గ్రీన్ కార్యాలయంగా దీన్ని మలిచింది. 15 అంతస్తుల్లో 1200 మంది ఉద్యోగులు కొలువుతీరేలా బెంగళూరు నడిబొడ్డున నూతన కార్యాలయన్ని ఏర్పాటు చేసింది. కేవలం పని ప్రదేశంలానే కాకుండా సృజనాత్మకత, వినూత్న రీతిలో ప్రజా రవాణాకు అనువుగా ఉండే మిన్స్క్ స్క్వేర్‌లో యాపిల్ నూతన కార్యాలయం ప్రారంభమైంది. కార్యాలయం లోపల ప్రత్యేకంగా ల్యాబ్స్, టీం వర్క్, కాఫీ బ్రేక్స్ కోసం కేఫ్ మ్యాక్స్ వంటి స్పెషల్ ఏరియాలు ఉన్నాయి. స్ధానికంగా లభించే మెటీరియల్స్‌తో స్టైలిష్ ఇంటీరియర్‌తో యాపిల్ నూతన కార్యాలయం ఆకట్టుకుంటుంది. చుట్టూ గ్రీనరీతో ఈ కార్యాలయం ఎకో ఫ్రెండ్లీగా ఆహ్లాదకరమైన పని ప్రదేశంగా కనిపిస్తుంది.
0 Comments