Ad Code

హార్ట్ బీట్, బాడీ టెంపరేచర్ చెక్ చేసే సెన్‌హైజర్ ఇయర్‌బడ్స్ !


న్స్యూమర్ ఎలక్ట్రానిక్స్ షో 2024లో రాబిట్ R1, సోనీ విజన్ ప్రో వంటి అనేక వినూత్న గ్యాడ్జెట్లు అన్‌వీల్ చేశాయి. వాటిలో ప్రముఖ జర్మన్ ఆడియో కంపెనీ సెన్‌హైజర్ పరిచయం చేసిన మొమెంటమ్ స్పోర్ట్ ఇయర్‌బడ్స్ చాలామంది దృష్టిని ఆకర్షించాయి. ఎందుకంటే వీటితో మ్యూజిక్ వినడం, కాల్స్ చేయడం మాత్రమే కాకుండా హార్ట్ బీట్ చెక్ చేయడం, బాడీ టెంపరేచర్ తెలుసుకోవడం వంటి పనులు కూడా చేయవచ్చు. హార్ట్ రేటు, బాడీ టెంపరేచర్ కొలవగల పర్సనల్ హెల్త్ ట్రాకర్‌గా వీటిని కొనుగోలుదారులు ఉపయోగించవచ్చు. ఫిట్‌నెస్, వెల్‌నెస్‌ను పర్యవేక్షిస్తూ డేటాను వివిధ యాప్స్‌తో లింక్ కూడా చేయవచ్చు. మూములు జాగర్ అయినా లేదా సీరియస్ అథ్లెట్ అయినా, ఈ ఇయర్‌బడ్స్ సరిగ్గా సూట్ అవుతాయి. ఈ వైర్‌లెస్ ఇయర్‌బడ్స్‌లో హార్ట్ బీట్ రేటు, శరీర ఉష్ణోగ్రతను రియల్ టైమ్‌లో పర్యవేక్షించగల ప్రత్యేక సెన్సార్లు ఉన్నాయి. ఆ సెన్సార్లు రికార్డ్ చేసే హెల్త్ డేటాను యాపిల్ హెల్త్ యాప్ లేదా గార్మిన్, పోలార్, స్ట్రవా వంటి ఇతర కంపాటబుల్ యాప్స్‌లో చూడవచ్చు. ఈ ఇయర్‌బడ్స్‌ ముఖ్యమైన శరీర సంకేతాలను ట్రాక్ చేయాలనుకునే హెల్త్-కాన్షియస్ వ్యక్తులకు లేదా స్మార్ట్ బ్యాండ్స్‌ లేదా వాచ్‌లను మరింత సౌకర్యవంతమైన డివైజ్‌లతో భర్తీ చేయాలనుకునే వారికి ఉత్తమంగా నిలుస్తాయి. మొమెంటమ్ స్పోర్ట్ ఇయర్‌బడ్స్‌ సెమీ-ఓపెన్ డిజైన్‌తో వస్తాయి కాబట్టి వీటిని యూచ్ చేస్తున్నా చుట్టూ ఏం జరుగుతుందో క్లియర్‌గా వినొచ్చు. యాక్టివ్ నాయిస్ క్యాన్సిలేషన్ టెక్నాలజీ కూడా వీటిలో అందిస్తారు కాబట్టి అన్‌వాంటెడ్ సౌండ్స్‌ వినిపించకుండా, మ్యూజిక్ ఎంజాయ్ చేయవచ్చు. అంతేకాకుండా, ఇయర్‌బడ్స్‌ మన్నికైనవి. వాటర్, డస్ట్ రెసిస్టెన్సీ కారణంగా ఎలాంటి యాక్టివిటీస్ చేసేటప్పుడైనా వీటిని ధరించవచ్చు.

Post a Comment

0 Comments

Close Menu