Ad Code

స్మార్ట్ ఫోన్ లో బ్రీత్ లాక్ ?


స్మార్ట్ ఫోన్ లో మనం ఫేస్ లాక్, ఫింగర్ ప్రింట్ లాక్ వంటి ఫీచర్స్ ను మాత్రమే చూశాము.  అయితే ఈసారి సెక్యూరిటీని మరింత పెంచే విధంగా సరికొత్త ఫీచర్స్ తో టెలికాం దిగ్గజ సంస్థలు పలు రకాల టెక్నాలజీని కనుగొంటున్నాయి.. గతంలో కొంత మంది ఫోటోలను చూపిస్తూ అన్లాక్ చేస్తూ ఉండగా, మరికొంత మంది నిద్రిస్తున్న సమయంలో వారి వెళ్లతోనే అన్ లాక్ చేసుకుంటూ ఉన్నారు. అయితే ఇప్పుడు ఈ భద్రత వ్యవస్థలను మరింత సేఫ్ చేసే విధంగా సరికొత్త సెక్యూరిటీ ఫీచర్స్ తో రాబోతున్నాయి. త్వరలోనే మన ఊపిరితో మొబైల్ అన్లాక్ చేయగలుగుతారని తెలుస్తోంది. అయితే వేలిముద్రల విషయంలో సాధ్యమైనట్లుగా ఎవరైనా వ్యక్తి మరణిస్తే ఆ మొబైల్ యొక్క ఫోన్ అన్లాక్ చేయకపోవడం జరుగుతుంది.. చైనాలోని ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీలో ఉన్నటువంటి నిపులలో ఒకరైన మహేష్ పంచాజ్ఞుల టీమ్ సరికొత్త ప్రయోగం చేసిన తర్వాత ఇలా చేయవచ్చు అంటూ అనౌన్స్మెంట్ చేశారు.. అయితే వీరు చెబుతున్న దాని ప్రకారం చూస్తే గాలి ఒత్తిడి వల్ల సెన్సార్ నుండి సేకరించబడిన శ్వాస వల్ల ఈ లాక్ ని చేయవచ్చట. ఈ డేటా సహాయంతోనే A1 మోడల్ సైతం రూపొందించవచ్చు. ఈ పరిశోధన బృందం ఒకరి శ్వాస డేటాను విశ్లేషించిన తర్వాత ఆస్వాస ఆ వ్యక్తికి చెందినదో కాదు 97% కచ్చితంగా ధ్రువీకరించగలదని తెలియజేశారు.. ఒక వ్యక్తి నుండి ముక్కు నోరు గొంతు ద్వారా ఉత్పన్నమయ్యే వేవ్స్ సమానంగా గుర్తించగలదని ఇది ప్రతి ఒక్కరి యొక్క శ్వాస చాలా భిన్నంగా ఉంటాయని తెలియజేస్తున్నారు. ఏది ఏమైనా ఇప్పటివరకు మనం ఫింగర్ ప్రింట్, ఫేస్ లాక్ వంటి ఫీచర్స్ ను చూసాము.. కానీ రాబోయే రోజుల్లో బ్రీతింగ్ లాక్ ఫీచర్ ని సైతం చూడబోతున్నామని చెప్పవచ్చు.. మరిది ఏ మేరకు సక్సెస్ అవుతుందో చూడాలి.

Post a Comment

0 Comments

Close Menu