Ad Code

గుజరాత్‌లో రెండో ప్లాంట్ ఏర్పాటు చేయనున్న మారుతి సుజుకి !


మారుతీ సుజుకీ ఇండియా లిమిటెడ్ గుజరాత్‌లో కొత్త కార్ల తయారీ ప్లాంట్‌ను నెలకొల్పనుంది. రాష్ట్రంలో రెండో కార్ల తయారీ ప్లాంట్ ఏర్పాటు చేసేందుకు దాదాపు రూ.35వేల కోట్ల పెట్టుబడి పెట్టనుందని సుజుకి మోటార్ కార్పొరేషన్ ప్రెసిడెంట్ తోషిహిరో సుజుకి ఒక ప్రకటనలో వెల్లడించారు. వైబ్రంట్ గుజరాత్ గ్లోబల్ సమ్మిట్ 2024 సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. గుజరాత్‌లో మారుతి రెండో కార్ల తయారీ ప్లాంట్‌ను ఒక మిలియన్ (సంవత్సరానికి 10 లక్షల యూనిట్లు) తయారు చేయగల సామర్థ్యంతో వస్తుందని చెప్పారు. 2030-31 నాటికి ప్లాంట్‌లో కార్ల ఉత్పత్తి సామర్థ్యాన్ని 4 మిలియన్లకు రెట్టింపు చేయాలనే లక్ష్యంతో ముందుకు సాగుతోంది. మారుతి సుజుకి ఇండియా లిమిటెడ్ ఐదవ కార్ల తయారీ ప్లాంట్ ప్రారంభించే ప్రణాళికలను ఇప్పటికే ప్రకటించింది. మారుతి కొత్త ప్లాంట్‌లో కార్యకలాపాలు FY29లో ప్రారంభం కానున్నాయి. తదనంతరం వార్షిక ఉత్పత్తి సామర్థ్యం 10 లక్షల యూనిట్లకు చేరుకోనుంది. కాకపోతే, ఈ ప్లాంట్ కోసం మొత్తం రూ.35వేల కోట్ల పెట్టుబడిలో భూసేకరణ ఖర్చు మాత్రం లేదని చెబుతోంది. మారుతి కొత్త ప్లాంట్ లొకేషన్, నిర్ణీత సమయంలో ఉత్పత్తి చేయబోయే మోడల్స్ వంటి మరిన్ని వివరాలను త్వరలో వెల్లడించనుంది.

Post a Comment

0 Comments

Close Menu