Ad Code

దేశీయ మార్కెట్లో ఎంజీ 'ఆస్టర్‌' విడుదల !


మోరిస్‌ గ్యారేజ్‌ (ఎంజీ) మోటార్ ఇండియా ఆస్టర్ అప్‌డేటెడ్‌ SUVని దేశీయ మార్కెట్లోకి విడుదల చేసింది. తక్కువ ధరలో ఆకర్షణీమైన ఫీచర్లతో సంస్థ లాంచ్‌ చేసింది. దీనిని ధర రూ. 9.98 లక్షల(ఎక్స్-షోరూమ్) ప్రారంభ ధరలో ఎంజీ మోటార్‌ ఇండియా లాంచ్‌ చేసింది. ఎంజీ ఆస్టర్‌ను కొత్త వెర్షన్‌లో ప్రవేశపెట్టింది. ఈ కొత్త MG Aster SUV స్ప్రింట్, షైన్, సెలెక్ట్, షార్ప్ ప్రో మరియు Savvy Pro వేరియంట్లలో ఈ కారు అందుబాటులో ఉంది. ఇది అనేక అప్‌డేట్లతో వస్తుంది. ఇందులో IRVM మరియు వెంటిలేటెడ్ సీట్లు ఉన్నాయి. వీటిని సావీ ప్రో ట్రిమ్ వేరింయట్‌లో ప్రత్యేకంగా ప్రవేపెట్టారు. కొత్త MG Aster లో i-Smart 2.0 కనెక్ట్ చేయబడిన టెక్నాలజీ, వైర్‌లెస్ స్మార్ట్‌ఫోన్ కనెక్టివిటీ, పనోరమిక్ సన్‌రూఫ్ మరియు వైర్‌లెస్ ఫోన్ ఛార్జర్‌ వంటి ఫీచర్లను అందిస్తోంది. 10.1-అంగుళాల టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్, 7-అంగుళాల పూర్తి డిజిటల్ ఇన్‌స్ట్రుమెంట్ క్లస్టర్, లెదర్ అప్‌హోల్‌స్టరీ మరియు లెదర్‌తో చుట్టబడిన స్టీరింగ్ వీల్ మరియు బ్లైండ్-స్పాట్ డిటెక్షన్‌ ఫీచర్లు ఉన్నాయి. కొత్త MG Aster SUVలో లెవెల్‌ 2 ADAS టెక్నాలజీని ప్రవేశపెట్టారు. ఇందులో 14 అధునాతన సేఫ్టీ ఫీచర్లను సంస్థ అందిస్తోంది. 360-డిగ్రీల సరౌండ్-వ్యూ కెమెరా, రెయిన్-సెన్సింగ్ వైపర్‌లు, 6-వే పవర్-అడ్జస్టబుల్ డ్రైవర్ సీటు, 6-స్పీకర్, ట్వీటర్‌లు, లేన్ చేంజ్ అసిస్ట్, రియర్ క్రాస్-ట్రాఫిక్ అలర్ట్, ఎలక్ట్రానిక్ స్టెబిలిటీ ప్రోగ్రామ్, ట్రాక్షన్ కంట్రోల్ సిస్టమ్, హిల్‌ హోల్డ్‌ కంట్రోల్‌ వంటి సేఫ్టీ ఫీచర్లను కొత్త ఎంజీ ఆస్టర్‌లో అందిస్తున్నారు.

Post a Comment

0 Comments

Close Menu