Ad Code

గూగుల్ క్రోమ్ వినియోగదారులకు అలర్ట్ !


గూగుల్ క్రోమ్ బ్రౌజర్ వినియోగదారుల కోసం తాజాగా మరో కొత్త ఫీచర్ తీసుకొచ్చింది. థర్డ్ పార్టీ కుకీస్ నిలిపివేసే కొత్త ఫీచర్ Google Chrome బ్రౌజర్‌లో చేర్చబడింది. ఈ కుకీస్ మీ డివైజ్ లో స్టోర్ చేయబడిన చిన్న ఫైల్‌లు. వాటి ద్వారా విశ్లేషణాత్మక డేటాను సేకరిస్తారు, ఆన్‌లైన్ ప్రకటనలను వ్యక్తిగతీకరిస్తారు, బ్రౌజింగ్‌ను కూడా పర్యవేక్షిస్తారు. ప్రారంభంలో, గూగుల్ క్రోమ్ బ్రౌజర్ ఈ ఫీచర్ 1 శాతం ప్రపంచ వినియోగదారులకు అంటే దాదాపు 3 కోట్ల మందికి అందుబాటులో ఉంటుంది. ఈ ఏడాది చివరి నాటికి పూర్తిగా కుకీస్ ను తొలగించే ప్లాన్ కూడా గూగుల్ దగ్గర ఉంది. అయితే దీని వల్ల నష్టపోతామని కొందరు ప్రకటనదారులు చెబుతున్నారు. గూగుల్ క్రోమ్.. ప్రపంచంలో అత్యంత ప్రజాదరణ పొందిన ఇంటర్నెట్ బ్రౌజర్. Apple Safari,Mozilla Firefox వంటి దాని ప్రత్యర్థి బ్రౌజర్‌లు ఇప్పటికే థర్డ్ పార్టీ కుకీస్ ను బ్లాక్ చేసే అవకాశాన్ని కలిగి ఉన్నాయి. అయితే, వాటి ఇంటర్నెట్ ట్రాఫిక్ చాలా తక్కువ. ఇకపై ర్యాండమ్ గా సెలక్ట్ చేయబడిన వినియోగదారులు మరింత గోప్యతతో బ్రౌజ్ చేయాలనుకుంటున్నారా అని అడగబడతారని Google తెలిపింది. Google వైస్ ప్రెసిడెంట్ ఆంథోనీ చావెజ్ ఒక బ్లాగ్ పోస్ట్‌లో.. Chrome నుండి థర్డ్ పార్టీ కుకీలను దశలవారీగా తొలగించడానికి బాధ్యతాయుతమైన విధానాన్ని తీసుకుంటున్నామని తెలిపారు. థర్డ్-పార్టీ కుకీస్ లేకుండా సైట్ పని చేయకపోతే, మీకు సమస్యలు ఉన్నట్లు Chrome గమనిస్తుందని Google తెలిపింది. కాబట్టి ఆ వెబ్‌సైట్ కోసం థర్డ్-పార్టీ కుక్కీలను తాత్కాలికంగా మళ్లీ ప్రారంభించే ఆప్షన్ ను అందిస్తామని గూగుల్ తెలిపింది. ఇంటర్నెట్‌ను మరింత ప్రైవేట్‌గా మార్చేందుకు కృషి చేస్తున్నట్లు గూగుల్ తెలిపింది.

Post a Comment

0 Comments

Close Menu