Ad Code

సోలిస్ నుంచి రెండు కొత్త ట్రాక్టర్లు !


ఇంటర్నేషనల్ ట్రాక్టర్స్ లిమిటెడ్ లో భాగమైన సోలిస్ ట్రాక్టర్స్ అంతర్జాతీయ మార్కెట్‌ల కోసం రెండు సరికొత్త ట్రాక్టర్‌లను లాంచ్ చేసింది. సోలిస్ S 75 షటిల్ XL, సోలిస్ C 48 మోడల్ ట్రాక్టర్లను ప్రవేశపెట్టింది. యూకేలో వ్యవసాయ యంత్రాలు, డివైజ్‌లు, సర్వీసుల ప్రదర్శన షోలో ఈ రెండు ట్రాక్టర్లను ఆవిష్కరించారు. సోలిస్ S 75 షటిల్ XL మోడల్ ఎస్-టెక్ 4-సిలిండర్ ఇంజన్, 12ఎఫ్+12ఆర్ ట్రాన్స్‌మిషన్‌ను ఉపయోగిస్తుంది. ఎస్-బూస్ట్ హైడ్రాలిక్స్, 3వేల కిలోల లిఫ్టింగ్ కెపాసిటీతో వస్తుంది. సోలిస్ సి48 3-సిలిండర్ సహజంగా-ఆస్పిరేటెడ్ ఇంజన్‌ను కలిగి ఉంది. గరిష్టంగా 146.2ఎన్ఎమ్ టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. ట్రాక్టర్ 12ఎఫ్+12ఆర్ ట్రాన్స్‌మిషన్‌ను పొందుతుంది. ఎస్-బూస్ట్ హైడ్రాలిక్‌లను కలిగి ఉంటుంది. సోలిస్ ప్రకారం.. ఎస్75 షటిల్ ఎక్స్ఎల్, సి48 రెండూ యూఎస్‌ఏ, యూరప్‌తో సహా గ్లోబల్ మార్కెట్‌లలో విక్రయిస్తున్నాయి. 1996లో స్థాపించిన ఐటీఎల్ భారత్‌లో మూడవ అతి పెద్ద ట్రాక్టర్ తయారీదారు, వాల్యూమ్ పరంగా ప్రపంచవ్యాప్తంగా ఐదవది. ఎఫ్‌వై23లో దాదాపు 35వేల యూనిట్లను పంపి గత 4 ఏళ్లలో భారత్ నుంచి ట్రాక్టర్లను ఎగుమతి చేసే కంపెనీగా అగ్రగామిగా కొనసాగుతోంది. కంపెనీ ఆర్థిక సంవత్సరంలో 28శాతం, హెచ్1 ఆర్థికసంవత్సరం 2024లో 36శాతం ఎగుమతి మార్కెట్ వాటాను కలిగి ఉంది.

Post a Comment

0 Comments

Close Menu