Ad Code

డీప్‌ ఫేక్‌ వీడియోలు, చిత్రాలు, ఆడియోలపై సత్య నాదెళ్ల ఆందోళన !


కృత్రిమ మేధ సాయంతో రూపొందుతున్న డీప్‌ ఫేక్‌ వీడియోలు, చిత్రాలు, ఆడియోలపై మైక్రోసాఫ్ట్‌ సీఈవో సత్య నాదెళ్ల ఆందోళన వ్యక్తం చేశారు. ఈ చర్యను భయానకమైందిగా అభివర్ణించారు. అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ డీప్ ఫేక్ ఆడియో, మిగతా ప్రముఖులకు చెందిన డీప్‌ ఫేక్‌ ఫొటోలు, చిత్రాలు తీవ్ర కలకలం రేపుతున్నాయి. తాజాగా అమెరికన్‌ పాప్‌ సింగర్‌ టేలర్‌ స్విఫ్ట్‌ కు చెందిన డీప్‌ ఫేక్‌ అశ్లీల దృశ్యాలు నెట్టింట వైరల్‌ అయ్యాయి. దీనిపై స్పందించిన నాదెళ్ల.. 'నెట్టింట ఈ ట్రెండ్‌ అత్యంత భయానకం. టెక్నాలజీ దుర్వినియోగంపై ప్రమాద ఘంటికలు మోగుతున్నాయి' అని ఆందోళన వ్యక్తం చేశారు.

Post a Comment

0 Comments

Close Menu