Ad Code

డీప్ ఫేక్ వీడియోపై కేంద్రానికి సచిన్ టెండూల్కర్ ఫిర్యాదు !


చిన్ టెండూల్కర్ కూతురు సారా, సోదరుడు అర్జున్ టెండూల్కర్ బర్త్ డే సందర్భంగా ఆమె దిగిన ఫొటోని దుండగులు మార్ఫింగ్ చేసి శుభ్ మన్ గిల్ ఫొటోను యాడ్ చేశారు. ఇది సారా, శుభ్ మన్ గిల్ ను కౌగలించుకున్నట్లు చూపుతోంది. అయితే తాజాగా సారా టెండూల్కర్ ఆన్‌లైన్ గేమ్‌ను ఆడటం ద్వారా రోజుకు లక్ష 80 వేల రూపాయలు సంపాదిస్తున్నట్లు ఒక వీడియో వైరల్ అవుతుంది. ఈ మాటలు ఎవరో కాదు మాస్టర్ బ్లాస్టర్ సచిన్ చెప్పినట్లుగా డీప్ ఫేక్ వీడియో తీవ్ర దుమారం రేపుతోంది. తన కూతురు రోజూ వేల రూపాయలను సంపాదిస్తోందంటూ సచిన్ స్వయంగా ఓ ఇంటర్వ్యూలో చెప్పినట్టుగా ఆ డీప్ ఫేక్ వీడియోలో ఉంది. సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న డీప్ ఫేక్ వీడియోపై భారత క్రికెట్ దిగ్గజం సచిన్ టెండూల్కర్ ఈ వీడియోలో ఉన్నది తాను కాదని, ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్ ద్వారా దీన్ని సృష్టించారని వెల్లడించారు. ఈ వీడియోలు నకిలీవి. సాంకేతికతను విపరీతంగా దుర్వినియోగం చేయడం కలవరపెడుతోంది. సోషల్ మీడియా ప్లాట్‌ఫారమ్‌లు అప్రమత్తంగా ఉండాలి. ఫిర్యాదులపై ప్రతిస్పందించాలి. తప్పుడు సమాచారం, నకిలీల వ్యాప్తిని అరికట్టడానికి వారి నుండి సత్వర చర్యలు చాలా కీలకం. అని టెండూల్కర్ ట్వీట్ చేశారు. డీప్ ఫేక్ వీడియో వ్యవహారంపై కేంద్ర ప్రభుత్వానికి ఫిర్యాదు చేసిన సచిన్..మీరు అలాంటి వీడియోలు, యాప్‌లు, ప్రకటనలను చూసినట్లయితే వెంటనే నివేదించాలని అందరిని అభ్యర్థించారు. 

Post a Comment

0 Comments

Close Menu