Ad Code

జీమెయిల్‌లో సీక్రెట్ ఫీచర్లు ?


జీమెయిల్‌లో ఉండే రకరకాల ఫీచర్ల గురించి చాలామందికి అంతగా తెలియదు. ఈ  ఫీచర్లను ఉపయోగించుకొని జీమెయిల్‌ను మరింత మెరుగ్గా వాడుకోవచ్చు. జీమెయిల్‌ను ఎక్కువగా ఉపయోగించేవాళ్లు పనులు త్వరగా పూర్తిచేసుకోవాలంటే జీమెయిల్‌లో ఉండే యాక్సెసబిలిటీ ఫీచర్లను వాడుకోవచ్చు. ఇవెలా ఉంటాయంటే చాలామంది ఒక్కసారి మెయిల్ పంపాక దాన్ని ఆపలేము అనుకుంటారు. అయితే జీమెయిల్‌లో కూడా 'అన్‌డూ' ఫీచర్ ఉంది. పొరపాటున తప్పుగా మెయిల్ పంపినప్పుడు 30 సెకన్లలోపు దాన్ని అన్‌డూ చేయొచ్చు. దీనికోసం జీమెయిల్‌లో జనరల్ సెట్టింగ్స్​లోకి వెళ్లి అక్కడ 'ఎనేబుల్ అన్‌డూ సెండ్' అనే ఫీచర్‌పై క్లిక్ చేయాలి. అక్కడ 20 లేదా 30 సెకన్లు ఎంచుకుని ఆప్షన్ సేవ్ చేయాలి. జీమెయిల్ ద్వారా విలువైన సమాచారాన్ని పంపినప్పుడు అవతలి వాళ్లు దాన్ని మరొకరికి ఫార్వార్డ్ చేయకుండా ఉండాలంటే జీమెయిల్‌లో ఉన్న 'కాన్ఫిడెన్షియల్ మోడ్'ను వాడాలి. ఈ ఫీచర్ ద్వారా పంపిన ఇ-మెయిల్ కొద్దిసేపటి తర్వాత దానంతట అదే డిలీట్ అవుతుంది. అత్యంత విలువైన సమాచారాన్న పంపేటప్పుడు ఈ మోడ్‌ను ఎనేబుల్ చేసుకోవచ్చు. దీనికోసం 'కంపోజ్​'పై క్లిక్ చేసి.. 'కాన్ఫిడెన్షియల్ మోడ్​'ను ఎనేబుల్ చేసుకోవాలి. కొంతకాలంపాటు జీమెయిల్ వాడము అనుకున్నప్పుడు జీమెయిల్‌ను వెకేషన్ మోడ్‌లో పెట్టేయొచ్చు. 'వెకేషన్ ఆటో రెస్పాండర్ మోడ్'ను యాక్టివేట్ చేయడం ద్వారా మీకొచ్చే మెయిల్స్‌కు ఆటోమెటిక్‌గా రిప్లై వెళ్లిపోతుంది. వెకేషన్‌ను ఎంజాయ్ చేసేటప్పుడు మెయిల్స్ గురించిన బెంగ ఉండదు. ఇన్‌బాక్స్‌లో బోలెడ్ మెయిల్స్ ఉంటాయి. వాటిలో ముఖ్యమైన మెయిల్స్ అని తెలిసేందుకు వీలుగా స్టార్ మార్క్ సెట్ చేసుకోవచ్చు. అయితే వీటిలో బ్లూ, గ్రీన్, రెడ్, యెల్లో ఇలా రంగులు కూడా ఉంటాయి. మీ ప్రాధాన్యతల ఆధారంగా మెయిల్స్‌కు రకరకాల రంగుల స్టార్స్‌ ఇచ్చుకోవచ్చు. ఆఫీస్ మెయిల్స్ పంపేటప్పుడు ఒకే మెసేజ్‌ను అందరికీ పంపాల్సి వస్తుంది. అలాంటప్పుడు ప్రతీసారి టైప్ చేసే పని లేకుండా జీమెయిల్‌లో ఉండే టెంప్లేట్స్‌ను వాడుకోవచ్చు. అలాగే మెయిల్ టైప్ చేసేటప్పుడు దోషాలు లేకుండా ఉండేందుకు సెల్ఫ్ చెక్ ఫీచర్‌ను ఎనేబుల్ చేసుకోవచ్చు.

Post a Comment

0 Comments

Close Menu