Ad Code

యూట్యూబ్‌లో హిడెన్ ఫీచర్స్ !


యూట్యూబ్లో ఎన్నో హిడెన్ ఫీచర్స్ ఉన్నాయి. వాటిలో కొన్ని తెలుసుకుందాం. యూట్యూబ్‌లో మనం చూసే వీడియోకు ఎంత ఇంటర్నెట్ ఖర్చవుతోంది ? మనం చూస్తున్న ఫోన్ మోడల్ వివరాలేమిటి ? వీడియో ID ఎంత ? వీడియో ఫార్మాట్, ఆడియో ఫార్మాట్, వాల్యూమ్ లెవల్, బ్యాండ్‌విడ్త్ సహా అన్ని డీటెయిల్స్‌ను మనం చెక్ చేయొచ్చు. ఇవన్నీ తెలియాలంటే.. You అనే tabపై ప్రెస్ చేసి General సెక్షన్‌ను ఎంచుకోవాలి. అందులో Enable stats for nerds అని ఉంటుంది. దాన్ని ఆన్ చేయాలి. ఆ తర్వాత మనం ఏదైనా వీడియో చూస్తుండగా.. ఎగువన కుడి భాగంలో ఉండే మూడు చుక్కల్ని ప్రెస్ చేసి, Additional settingsలోకి వెళ్లి stats for nerds ఆప్షన్‌ను సెలెక్ట్ చేసుకోవాలి. ఆ వెంటనే వీడియో ఇన్ఫో(YouTube Hidden Features) మొత్తం కనిపిస్తుంది యూట్యూబ్​లో మనం చాలా టైం వేస్ట్ చేస్తుంటాం. టైం వేస్ట్ కాకుండా చూసుకోవడానికి 'యూట్యూబ్​ వాచ్​ టైమ్'ను సెట్ చేసుకోవాలి. ఇందుకోసం Settingsలోకి వెళ్లి General సెక్షన్‌లోని Remind me to take a break అనే ఆప్షన్​ను ఎంపిక చేయాలి. అందులో ఎంతసేపటి వరకు బ్రేక్ తీసుకోవాలో మనం సెట్ చేయాలి. 5 నిమిషాల నుంచి మొదలుకొని 23 గంటల 55 వరకు మనకు ఇష్టం వచ్చిన మేర బ్రేక్ టైమ్​ను సెట్​ చేసుకోవచ్చు. యూట్యూబ్‌లో మనం అంత టైమ్ గడిపాక.. బ్రేక్​ నోటిఫికేషన్ వచ్చేస్తుంది. మనం నిద్రపోవాల్సిన టైంను గుర్తు చేయడానికిగానూ.. యూట్యూబ్‌లోని Settingsలో ఉండే General సెక్షన్‌లో Remind me when it’s bedtime break అనే ఆప్షన్​ను ఎంపిక చేస్తే సరిపోతుంది. ఎడ్యుకేషనల్ వీడియోలతో పాటు ఇష్టమైన మ్యూజిక్ వీడియోలను, నచ్చిన కంటెంట్‌ను రిపీట్‌ చేసుకోవడానికి యూట్యూబ్ లూప్ ఫీచర్‌ను వాడుకోవచ్చు. ఇందుకోసం తొలుత మీకు నచ్చిన వీడియోను తెరవండి. ఆ తర్వాత చాప్టర్స్ లిస్టు తెరవండి. మీరు పోర్ట్రెయిట్ మోడ్‌లో ఉంటే.. వీడియో కింద డిస్క్రిప్షన్ బాక్స్ ఆన్ చేస్తే కింద వీడియోల లిస్టు వస్తుంది. ఒకవేళ ఫుల్ స్క్రీన్ మోడ్‌లో ఉంటే.. స్క్రీన్‌పై నొక్కి మీకు కావాల్సిన చాప్టర్‌ను ఎంపిక చేసుకోండి. అనంతరం కిందికి స్క్రోల్ చేసి.. లూప్ చేయాలనుకుంటున్న చాప్టర్‌పై నొక్కండి. లూప్ బటన్‌ను నొక్కి వీడియో టైమ్‌లైన్‌ని చూస్తే.. మీకు కావాల్సిన చాప్టర్ ఒక్కటే హైలెట్ అవుతుంది. తద్వారా మీకు నచ్చిన ఛాప్టర్​ను రిపీట్ చేసుకొని చూడొచ్చు. యూట్యూబ్ వీడియో మధ్యలో ఉండే ఎడమ నేవిగేషన్, కుడి నేవిగేషన్‌లను వేళ్లతో నొక్కి.. దాన్ని ఫార్వర్డ్, బ్యాక్​వర్డ్ చేయొచ్చు. ఈవిధంగా నొక్కితే వీడియో ఎంత సేపు స్కిప్ కావాలో మనమే సెట్ చేయొచ్చు. ఎలాగంటే.. Settings లోని General సెక్షన్‌లో Double-tap to seek అనే ఆప్షన్‌పై ప్రెస్ చేసి స్కిప్ టైమ్​ను డిసైడ్ చేయొచ్చు. స్కిప్ టైమ్ అనేది 5 సెకన్ల నుంచి 60 సెకన్ల దాకా ఉంటుంది. వీడియో ప్లే అవుతున్నప్పుడు రెండు వేళ్లతో పించ్ చేయడం వల్ల దాన్ని జూమ్ ఇన్, జూమ్ అవుట్ చేయొచ్చు. పుల్​ స్క్రీన్​ మోడ్​లో వీడియోను మనం చూస్తూ.. వేలితో Swipe up చేస్తే అదే రకమైన కంటెంట్​కు సంబంధించిన వీడియోల లిస్టు కనిపిస్తుంది. యూట్యూబ్ అకౌంట్లోకి సైన్​ ఇన్ కాకుండానే వీడియోలను చూసేందుకు Incognito మోడ్​ని ఆన్ చేయండి. దీనివల్ల మీరు చూసే కంటెంట్​ యూట్యూబ్ హిస్టరీలో నమోదు కాదు. ఇందుకోసం ఇలా చేయండి. తొలుత యూట్యూబ్ అకౌంట్ బటన్‌ను (You tab) ప్రెస్ చేస్తే.. అకౌంట్ నేమ్ కింద Turn on Incognito అనే ఆప్షన్ కనిపిస్తుంది. పని పూర్తయిన తరువాత Turn Off Incognito నొక్కి దాన్ని ఆఫ్​ చేసుకోవచ్చు. ఇందుకోసం మరో మార్గం కూడా ఉంది. యూట్యూబ్‌లో Settings ఓపెన్ చేసి.. History and Privacy సెక్షన్‌లోని Manage All History విభాగాన్ని ఎంపిక చేయాలి. అనంతరం మన యూట్యూబ్​ అకౌంట్​ను సెలెక్ట్ చేయాలి. చివరగా యూట్యూబ్​ హిస్టరీ పేజ్​లోకి వెళ్లి.. Controls ట్యాబ్ ప్రెస్ చేస్తే అక్కడ Turn Off అని కనిపిస్తుంది. దాన్ని నొక్కితే Pause అనే ఆప్షన్​ వస్తుంది. దీన్ని సెలెక్ట్ చేసుకుంటే  మీ సబ్​స్క్రిప్షన్ కనిపిస్తుంది కానీ సెర్చ్​ యాక్టివిటీస్​ మాత్రం రికార్డ్ కావు.

Post a Comment

0 Comments

Close Menu