ఏలియన్ వేర్ M16 and M18 ల్యాప్ టాప్ లను ఈ షో నుండి రివీల్ చేసింది. ముందుగా Alienware M16 గురించి చూస్తే, ఇది కొత్త లుక్ తో అప్గ్రేడ్ చెయ్యబడింది. ఈ గేమింగ్ ల్యాప్ టాప్ ఇప్పుడు థర్మల్ సొల్యూషన్ ల కోసం 43% అధిక ఎయిర్ ఫ్లో తో ఉన్నట్లు Dell తెలిపింది. ఈ ల్యాప్ టాప్ 16 ఇంచ్ డిస్ప్లే Intel Core Ultra H Series ప్రోసెసర్ మరియు Nvidia RTX 4070 GPU లతో వస్తుంది. ఈ ల్యాప్ టాప్ ను $1,649.99 ధరతో లాంచ్ చేసింది. M18 ల్యాప్ టాప్ విషయానికి వస్తే, ఇది 14th Gen Intel Core i9-14900HX ప్రోసెసర్ జతగా Nvidia RTX 4090 GPU తో కలిగి వుంది. ఈ ల్యాప్ టాప్ డిస్ప్లే కూడా 16 ఇంచ్ తో ఉంటుంది మరియు $1,899.99 ధరతో లాంచ్ చెయ్యబడింది.
Acer Predator Helios Neo ని సిఇఎస్ 2024 నుండి ఏసర్ ఆవిష్కరించింది. ఈ గేమింగ్ ల్యాప్ టాప్ Intel Core 14th gen ప్రోసెసర్ జతగా Nvidia GeForce RTX 40 Series GPU తో కలిగి వుంది. ఈ ఏసర్ ల్యాప్ టాప్ 16 ఇంచ్ మరియు 18 ఇంచ్ రెండు డిస్ప్లే సైజులలో లభిస్తుంది. ఇది 250 Hz రిఫ్రెష్ రేట్ మరియు 1000 నిట్స్ వరకూ పీక్ బ్రైట్నెస్ అందించగల Mini LED IPS ప్యానల్. ఈ ఏసర్ గేమింగ్ ల్యాప్ టాప్ 32GB RAM మరియు 2TB స్టోరేజ్ లతో వచ్చింది. ఇది ఫుల్ రేంజ్ పోర్ట్ లను కలిగి వుంది. ఇందులో, థండర్ బోల్ట్ 4 పోర్ట్స్ తో 2 USB Type-C పోర్ట్స్, HDMI 2.1 మరియు మైక్రో SD కార్డు రీడర్స్ ను కూడా కలిగి వుంది.
0 Comments