Ad Code

ఛాట్‌జీపీటీకి గట్టి పోటీ ఇస్తున్న మైక్రోసాఫ్ట్ కోపైలట్ ?


మైక్రోసాఫ్ట్ ఇటీవలే దాని కోపైలట్ ఏఐ ప్రో వెర్షన్ను లాంచ్ చేసింది. ఇంతకుముందు కంపెనీ దీనిని ఎంటర్ప్రైజెస్ కోసం విడుదల చేసింది. కానీ ఇప్పుడు ఇది సాధారణ ప్రజలకు కూడా అందుబాటులోకి వచ్చింది. కోపైలట్ ప్రో అనేది ఓపెన్ ఏఐ ఛాట్జీపీటీ ప్లస్ని పోలి ఉంటుంది. దీనిలో వినియోగదారులు క్విక్ రియాక్షన్స్, జీపీటీ-4, జీపీటీ టర్బో-4 వంటి తాజా మోడళ్లకు యాక్సెస్ పొందుతారు. భారతదేశంలో మైక్రోసాఫ్ట్ కోపైలట్ ప్రో ధర దాదాపు రూ. 2,000 కాగా, ఓపెన్ ఏఐ ఛాట్జీపీటీ ప్లస్ ధర రూ. 1,950గా ఉంది. రెండు మోడల్లు ఉపయోగిస్తున్నప్పుడు దాదాపు ఒకే విధమైన రియాక్షన్ను అందిస్తాయి. అంటే రియాక్షన్ స్పీడ్, ఫీచర్లు దాదాపు ఒకే విధంగా ఉంటాయి. ఛాట్జీపీటీ ప్లస్కు సభ్యత్వం పొందిన వినియోగదారులు జీపీటీ ప్రయోజనాన్ని పొందుతారు. జీపీటీ స్టోర్లో మూడు మిలియన్లకు పైగా కస్టమ్ జీపీటీలు లిస్ట్ అయ్యాయి. వినియోగదారులు తాము చేసే పని ప్రకారం వీటిలో దేనినైనా ఉపయోగించవచ్చు. మైక్రోసాఫ్ట్ కోపైలట్ ప్రస్తుతం జీపీటీలకు సపోర్ట్ చేయదు. అయితే లాంచ్ సమయంలో ఈ ఫీచర్ త్వరలో యాడ్ అవుతుందని కంపెనీ తెలిపింది. మైక్రోసాఫ్ట్ 365కి సబ్ స్క్రయిబ్ చేసుకున్న కోపైలట్ ప్రో యూజర్లు అనేక యాప్లలో ఏఐ ఫీచర్ల మద్దతును పొందుతారు. ఎంఎస్ వర్డ్, ఎక్సెల్, పీపీటీ, అవుట్లుక్, వన్ నోట్ మొదలైన వాటిలో ఏఐ సహాయంతో వినియోగదారులు తమ పనిని సులభంగా పూర్తి చేయగలుగుతారు. ఏఐ సహాయంతో మీరు పీపీటీలను సృష్టించగలరు. పొడవైన వర్డ్ డాక్యుమెంట్లను సమ్మరైజ్ చేయగలరు. అవుట్లుకక్లో సింగిల్ ప్రాంప్ట్లో ఈ-మెయిల్స్ను రాయగలరు. ఛాట్జీపీటీ ప్లస్లో వినియోగదారులు ఈ ప్రయోజనాన్ని పొందలేరు. రెండు మోడల్స్లో మీరు ఫోటోలను రూపొందించడానికి డాల్-ఈ సపోర్ట్ని పొందుతారు. వినియోగదారులు ఏఐ సహాయంతో ఒక రోజులో 100 ఫోటోలను రూపొందించవచ్చు. మైక్రోసాఫ్ట్ కోపైలట్ ప్రో... కంపెనీలకు ఉత్తమమైనది ఎందుకంటే ఇది వారి అనేక పనులను సులభతరం చేస్తుంది. అదే సమయంలో ఛాట్జీపీటీ ప్లస్ డెవలపర్లు, సాధారణ వినియోగదారులకు చాలా బాగుంటుంది. మీరు మీ పనిని బట్టి అవసరమైన దాన్ని ఎంచుకోవచ్చు. మరోవైపు హానర్ 90 5జీ స్మార్ట్ ఫోన్పై కంపెనీ భారీ తగ్గింపును అందించింది. ఈ ఫోన్ గతంలో మనదేశంలో లాంచ్ అయింది. ఇప్పుడు దీని భారీ తగ్గింపు అందించారు. ఏకంగా రూ.20 వేల ధరలోపే హానర్ 90 5జీని కొనుగోలు చేయవచ్చు. క్వాల్కాం స్నాప్డ్రాగన్ 7 జెన్ 1 ప్రాసెసర్పై ఈ ఫోన్ పని చేయనుంది. దీని బ్యాటరీ సామర్థ్యం 5000 ఎంఏహెచ్ కాగా, 66W వైర్డ్ సూపర్ ఛార్జ్ టెక్నాలజీ కూడా అందించారు. ఫోన్ వెనక 200 మెగాపిక్సెల్, ముందు వైపు 50 మెగాపిక్సెల్ ఫ్రంట్ కెమెరా సెన్సార్ ఉంది. రెండు సంవత్సరాల పాటు ఆపరేటింగ్ సిస్టం అప్డేట్స్, మూడు సంవత్సరాల పాటు సెక్యూరిటీ అప్డేట్స్ను కంపెనీ అందించనున్నట్లు తెలిపింది.

Post a Comment

0 Comments

Close Menu