Ad Code

అమ్మకాల్లో అత్యంత వేగంగా లక్ష యూనిట్ల మార్క్ దాటిన మారుతి సుజుకి ఫ్రాంక్స్ !


మారుతి సుజుకి ఇండియా ఫ్రాంక్స్ మోడల్ కార్ల అమ్మకాల్లో భారత మార్కెట్లో అత్యంత వేగంగా లక్ష యూనిట్ల విక్రయాల మార్కును చేరుకున్న కారుగా అవతరించింది. మారుతి సుజుకి ఫ్రాంక్స్ టాటా నెక్సాన్, హ్యుందాయ్ వెన్యూ, కియా సోనెట్ వంటి వాటికి గట్టిపోటీనిచ్చింది. ఏప్రిల్ 2023లో మారుతి సుజుకి ఫ్రాంక్స్ లాంచ్ అయినప్పటి నుంచి ఒక లక్ష యూనిట్ల విక్రయ మైలురాయిని సాధించింది. సబ్-4 మీటర్ల కాంపాక్ట్ ఎస్‌యూవీ ఈ మార్కును చేరుకోవడానికి కేవలం 10 నెలల సమయం పట్టింది. తద్వారా భారత మార్కెట్లోనే లక్ష యూనిట్ల విక్రయాల మార్కును అత్యంత వేగంగా చేరుకున్న కారుగా నిలిచింది. ఈ మైలురాయితో మారుతి సుజుకి ఫ్రాంక్స్ 12 నెలల్లో లక్ష యూనిట్ల వాల్యూమ్‌ను చేరుకుని మారుతి సుజుకి గ్రాండ్ విటారాను దాటేసింది. మారుతి సుజుకి ఇండియా మార్కెటింగ్, సేల్స్ సీనియర్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ శశాంక్ శ్రీవాస్తవ ప్రకారం ఫ్రాంక్స్ సంస్థ ఎస్‌యూవీ సెగ్మెంట్ వాటాను 2022లో 10.4శాతం నుంచి 2023లో 19.7శాతానికి రెట్టింపు చేయడంలో కీలకపాత్ర పోషించింది. మారుతి ఫ్రాంక్స్ రెండు ఇంజన్ ఆప్షన్లను కలిగి ఉంది. 1.2-లీటర్ డ్యూయల్-జెట్ డ్యూయల్-వీవీటీ పెట్రోల్ (89.73పీఎస్ గరిష్ట శక్తి, 113ఎన్ఎమ్ గరిష్ట టార్క్) 1.0-లీటర్ టర్బో బూస్టర్‌జెట్ పెట్రోల్ (100.06పీఎస్ గరిష్ట శక్తి 147.6ఎన్ఎమ్ గరిష్ట శక్తి టార్క్) కలిగి ఉంటుంది. 1.2-లీటర్ యూనిట్‌ను 5-స్పీడ్ ఎంటీ లేదా 5-స్పీడ్ ఎఎంటీతో కలిసి ఉంటుంది. 1.0-లీటర్ యూనిట్ 5-స్పీడ్ ఎంటీ 6-స్పీడ్ ఎటీ ఆప్షన్లను పొందుతుంది. 5-స్పీడ్ ఎంటీతో కూడిన 1.2-లీటర్ డ్యూయల్-జెట్ డ్యూయల్-వీవీటీ పెట్రోల్ ఇంజన్ (77.5పీఎస్ 98.5ఎన్ఎమ్)తో సీఎన్‌జీ ఆప్షన్ కూడా ఉంది. ఫ్రాంక్స్ ఆటోమేటిక్ వేరియంట్‌లు మొత్తం వాల్యూమ్‌లో 24శాతం ఉన్నాయని కంపెనీ పేర్కొంది. జూలై 2023లో మారుతి ఫ్రాంక్స్‌ను ఎగుమతి చేయడం ప్రారంభించగా, లాటిన్ అమెరికా, మిడిల్ ఈస్ట్, సౌత్-ఈస్ట్ ఆసియాలోని మార్కెట్‌లకు ఇప్పటివరకు 9వేల యూనిట్లకు పైగా రవాణా చేసింది. 

Post a Comment

0 Comments

Close Menu