Ad Code

నిర్దేశించిన ప్రదేశంలో దిగిన మూన్ 'స్నైపర్'!


పాన్‌ మానవరహిత అంతరిక్ష నౌక ప్రయోగించింది. అది చంద్రమండలంపై నిర్దేశించిన ప్రదేశంలో దిగిందని జపాన్‌ అంతరిక్ష సంస్థ తెలిపింది. స్మార్ట్‌ ల్యాండర్‌ ఫర్‌ ఇన్వెస్టిగేటింగ్‌ మూన్‌ (స్లిమ్‌) చంద్రుడి ఉపరితలంపై ఉదయం 12.20 గంటల సమయంలో దిగిందని పేర్కొంది. తాజా విజయంతో చంద్రుడిపైకి విజయవంతంగా అంతరిక్ష నౌకను పంపిన ఐదో దేశంగా జపాన్‌ అవతరించింది.  చంద్రుడిపై సాఫీగానే దిగిన జపాన్ 'మూన్ స్నైపర్'. భూమ్మీది గ్రౌండ్ స్టేషనుతో సంబంధాలూ బాగానే ఉన్నా, ల్యాండరులోని సౌరఘటాలు (సౌరఫలకాలు/సోలార్ ప్యానెల్స్) పనిచేయడం లేదు. ప్రస్తుతం 'స్లిమ్' తన సొంత బ్యాటరీపైనే ఆధారపడుతోంది. ల్యాండర్ డేటా భూమికి ప్రసారమయ్యేలా విశ్వప్రయత్నాలు చేస్తున్నారు. 'స్లిమ్' సొంత బ్యాటరీలో శక్తి అయిపోతే, ఈలోగా సౌరవిద్యుత్ అందుబాటులోకి రాకుంటేజ్ ఫలితం శూన్యం. చంద్రుడిపై జపాన్ కేవలం 100 మీటర్ల వ్యాసంతో ఓ గిరి గీసింది. కచ్చితంగా అదే గిరిలో ల్యాండరును క్షేమంగా దింపింది. ఇదే ప్రెసిషన్ ల్యాండింగ్. పిన్ పాయింట్ ల్యాండింగ్. అంతరిక్షంలో ఇలాంటివి అనితర సాధ్యం. చంద్రుడి ఉపరితలంపై దిగేటప్పుడు జపాన్ 'మూన్ స్నైపర్' (స్లిమ్) ల్యాండర్ ఏమీ దెబ్బతినలేదు. కనుక బహుశా దాని సౌరఫలకాలు (సోలార్ ప్యానెల్స్) సైతం పాడవకుండా భేషుగ్గానే ఉండి ఉంటాయి. కాకపోతే తలెత్తిన సాంకేతిక సమస్య వల్ల సౌరశక్తిని వ్యోమనౌక వినియోగించుకోలేకపోతోంది. ప్రస్తుతం ఆన్‌బోర్డ్‌ బ్యాటరీపై అది ఆధారపడుతోంది. కొన్ని గంటలపాటు మాత్రమే ఆ బ్యాటరీ పవర్ అందించగలదు. మరి ఆ తర్వాత పరిస్థితేంటి? ఓ ఆశ మిణుకు మిణుకుమంటోంది! 'మూన్ స్నైపర్' సౌర ఫలకాలు సూర్యుడి దిశగా లేవని 'జాక్సా' శాస్త్రవేత్తలు వివరిస్తున్నారు. రాబోయే రోజుల్లో సూర్యుడి దిశ (కోణం) మారగానే అవి సౌర విద్యుత్ తయారు చేస్తాయనేది వారి వాదన. ఒకసారి సోలార్ ప్యానెల్స్ సరిగా పని చేయడమంటూ మొదలైతే ల్యాండర్ కొన్ని రోజులపాటు జీవించి అప్పగించిన విధులు నిర్వర్తిస్తుంది. అనంతరం కొన్ని రోజులకు సోలార్ ప్యానెల్స్ పాడవుతాయి. ఎందుకంటే చంద్రుడిపై పగటి వేళలో నమోదయ్యే 100 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రతలకు అవి క్రమంగా నాశనమవుతాయి. 

Post a Comment

0 Comments

Close Menu