Ad Code

అణు గడియారాన్ని తయారు చేసిన చైనా !


చైనా అణు గడియారాన్నితయారు చేసింది. ఇది ప్రపంచంలోనే అత్యంత పర్ఫెక్ట్‌గా టైంను చూపిస్తుందని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. ఈ గడియారం ఎంత పర్ఫెక్టు అంటే.. దాదాపు 720 కోట్ల ఏళ్ల పాటు ఎలాంటి పొరపాటు, తడబాటు లేకుండా టైంను చూపిస్తుంది. అప్పటిదాకా టిక్ టిక్ అంటూ ఈ గడియారం నడుస్తూనే ఉంటుంది. స్ట్రోంటియం, అల్ట్రా స్టేబుల్ అనే లేజర్‌లను ఉపయోగించి దీన్ని యూనివర్సిటీ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ ఆఫ్ చైనాలోని సైంటిస్టులు తయారు చేశారు. ఇదొక ఆప్టికల్ క్లాక్‌. దీంతో ప్రపంచంలో ఈ తరహా గడియారాన్ని తయారు చేసిన రెండో దేశంగా చైనా నిలిచింది. ఇందులో చూపించే టైంలో అనిశ్చితి, అస్థిరత అనేది మిగతా సాధారణ గడియారాల కంటే ఐదు క్విన్టిలియన్ల మేర తక్కువగా ఉంటుందట. రాబోయే 700 కోట్ల సంవత్సరాలలో ఈ గడియారం ఒక్క సెకను మాత్రమే సమయంలో పొరపాటు, తడబాటు చూపించే ఛాన్స్ ఉంటుంది. ఇలాంటి ఆప్టికల్ క్లాక్‌లను ఉపయోగించి మరింత ఖచ్చితమైన గ్లోబల్ పొజిషనింగ్ సిస్టమ్స్, క్వాంటం కీ డిస్ట్రిబ్యూషన్‌లను శాస్త్రవేత్తలు అభివృద్ధి చేస్తారు. అత్యంత కచ్చితమైన పరమాణు గడియారాన్ని అమెరికాలోని బౌల్డర్‌లో ఉన్న కొలరాడో విశ్వవిద్యాలయం సైంటిస్టులు తొలిసారిగా తయారు చేశారు. ఇప్పుడు చైనా ఈ తరహా గడియారాన్ని డెవలప్ చేసింది. జపాన్, జర్మనీ దేశాలు కూడా ఇలాంటి అణు గడియారాల తయారీపై ప్రస్తుతం రీసెర్చ్ చేస్తున్నాయి.

Post a Comment

0 Comments

Close Menu