Ad Code

మనిషి మెదడులో 'చిప్' అమర్చిన న్యూరాలింక్ !


లన్ మస్క్ సారధ్యంలోని స్టార్టప్ కంపెనీ 'న్యూరాలింక్ ' సోమవారం మనిషి మెదడులో విజయవంతంగా చిప్ ఇన్‌స్టల్ చేసింది. మానవుడి మెదడుకు, కంప్యూటర్‌కు మధ్య నేరుగా సంబంధాలు మెరుగు పరిచే లక్ష్యంతో ఎలన్ మస్క్ కో-పౌండర్‌గా న్యూరో టెక్నాలజీ సంస్థ 2016లో ఏర్పాటైంది. మానవుడి శక్తి సామర్థ్యాలను బలోపేతం చేయడంతోపాటు పార్కిన్సన్ వంటి వ్యాధులను నివారించడమే లక్ష్యమే. ఇది. దీంతోపాటు మానవుడికి, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మధ్య సంకేతాత్మక సంబంధం బలోపేతం చేయడానికి మానవుడి మెదడులో అమర్చే చిప్ ఉపకరిస్తుంది. 'నిన్న మనిషి మెదడులో చిప్ అమర్చాం. ఆ రోగి క్రమంగా కోలుకుంటున్నాడు' అని ఎలన్ మస్క్ తన 'ఎక్స్ (మాజీ ట్విట్టర్)' ఖాతాలో పోస్టు చేశాడు. 'దీని ప్రారంభ ఫలితాల్లో న్యూరాన్ స్పైక్ డిటెక్షన్ ను గుర్తించినట్లు తెలిపాడు. మానవుడి మెదడులో చిప్ అమర్చేందుకు గతేడాది మేలో అమెరికా ఫుడ్ అండ్ డ్రగ్స్ అడ్మినిస్ట్రేషన్ (ఎఫ్‌డీఏ) ఆమోదం తెలిపింది. బ్రెయిన్ మెషిన్ లేదా న్యూరాలింక్ బ్రెయిన్ కంప్యూటర్ ఇంటర్ ఫేస్ లో 8 మి.మీ వ్యాసంతో కూడిన చిప్ లో సన్నని ఎలక్ట్రోడ్లు ఉంటాయి. వెంటుకలో 20 శాతం మాత్రమే ఈ చిప్ మందం ఉంటుంది. పుర్రెలో కొంత భాగం తొలగించి దీన్ని అమరుస్తారు. ఇందులోని సన్నటి ఎలక్ట్రోడ్లను మెదడులోని ముఖ్యమైన భాగాలకు పంపుతారు. మెదడులోని ఎలక్ట్రోడ్లు బ్రెయిన్ కు సంకేతాలు వెళతాయి. మెదడులోకి విద్యుత్ సంకేతాలు పంపడంతోపాటు అందుకోవడం, ప్రేరిపిస్తాయి. ఆ విద్యుత్ సంకేతాలను కంప్యూటర్లు విశ్లేషించే ఆల్గోరిథమ్ లు గా మారుస్తుంది.

Post a Comment

0 Comments

Close Menu