Ad Code

వోక్స్‌వ్యాగన్ కార్లలో చాట్‌జీపీటీ !


ప్రముఖ జర్మన్ కారు కంపెనీ వోక్స్‌వ్యాగన్ 2024 రెండవ త్రైమాసికం నుంచి కొన్ని మోడళ్లలో చాట్‌జీపీటీని ఇన్‌స్టాల్ చేయనున్నట్లు తాజాగా ప్రకటించింది. ఈ ఫీచర్ మొదట యూరప్‌లో, తరువాత అమెరికాలో అందుబాటులోకి వస్తుంది. 2024లో జరిగిన కన్స్యూమర్ ఎలక్ట్రానిక్స్ షోలో వోక్స్‌వ్యాగన్ కంపెనీ అప్‌కమింగ్ కార్లలో అందించనున్న చాట్‌జీపీటీ వాయిస్ అసిస్టెంట్‌ను ప్రదర్శించింది. టెక్నాలజీ పార్ట్‌నర్ సెరెన్స్ సహకారంతో వోక్స్‌వ్యాగన్ ఈ ఫంక్షనాలిటీని డెవలప్ చేసింది. ప్రస్తుతం ఈ కార్లలో IDA వాయిస్ అసిస్టెంట్ అందిస్తున్నారు. ఇందులోనే చాట్‌జీపీటీని ఇంటిగ్రేట్ చేయనున్నారు. చాట్‌జీపీటీ డ్రైవింగ్ ఎక్స్‌పీరియన్స్‌ను మరింత కన్వీనియంట్, ఎంజాయబుల్‌గా మారుస్తుంది. కారులో ఎయిర్ కండీషనర్ వంటి బేసిక్ ఫంక్షన్స్‌ కంట్రోల్ చేయడానికి లేదా జీకే ప్రశ్నలకు క్విక్ ఆన్సర్స్‌ పొందడానికి దీన్ని ఉపయోగించవచ్చు. చాట్‌జీపీటీతో నేచురల్ కన్వర్జేషన్స్‌ కూడా చేయవచ్చు. కారు పర్ఫామెన్స్, మెయింటెనెన్స్, సేఫ్టీ వంటి యూజ్‌ఫుల్ ఇన్ఫర్మేషన్ చిటికెలో పొందవచ్చు. ఇవన్నీ హ్యాండ్స్-ఫ్రీగా చేయవచ్చు కాబట్టి ఆ సమయంలో రోడ్డు, ప్రయాణంపై పూర్తి దృష్టి పెట్టవచ్చు. వోక్స్‌వ్యాగన్ కార్లను చాట్‌జీపీటీతో ఇంటిగ్రేట్ చేయాలని భావిస్తోంది. ఎందుకంటే ఇన్‌-కార్‌ వాయిస్ అసిస్టెంట్ కారు, డ్రైవర్ మధ్య ఇంటరాక్షన్‌ను మెరుగుపరుస్తుంది. ఇది రిపేర్, సర్వీస్ ప్రాసెస్‌లలో కీలకంగా నిలిచే డేటాకు సులభంగా యాక్సెస్‌ను అందిస్తుంది. కారులో చాట్‌జీపీటీని ఉపయోగించడానికి సైన్ అప్ చేయాల్సిన అవసరం లేదు, లేదా ఏదైనా యాప్‌ని ఇన్‌స్టాల్ చేయాల్సిన పని లేదు. దాన్ని యాక్టివేట్ చేయడానికి స్టీరింగ్ వీల్‌పై బటన్‌ను నొక్కాలి లేదా "హలో IDA" అని సింపుల్‌గా ఒక వాయిస్ కమాండ్ ఇస్తే సరిపోతుంది. వోక్స్‌వ్యాగన్ ప్రైవసీ, డేటా ప్రొటెక్షన్ గురించి కూడా శ్రద్ధ వహిస్తుంది. చాట్‌జీపీటీతో ఎక్స్ఛేంజ్ చేసుకునే ఏవైనా ప్రశ్నలు, సమాధానాలు కన్వర్జేషన్ ముగిసిన వెంటనే డిలీట్ అవుతాయని కంపెనీ చెబుతోంది. వోక్స్‌వ్యాగన్ వాహనాల్లో చాట్‌జీపీటీని ఇంటిగ్రేట్ చేయడానికి కార్ల వాయిస్, AI సొల్యూషన్స్‌లో ప్రత్యేకత కలిగిన సెరెన్స్ అనే కంపెనీతో కలిసి పని చేస్తోంది.

Post a Comment

0 Comments

Close Menu